newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

అభిమాని కుటుంబానికి భారీ సాయం చేసిన రామ్ చరణ్..

09-12-201909-12-2019 17:16:50 IST
2019-12-09T11:46:50.203Z09-12-2019 2019-12-09T11:46:48.278Z - - 24-01-2020

అభిమాని కుటుంబానికి భారీ సాయం చేసిన రామ్ చరణ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోమారు తన గొప్ప మనసును చాటుకున్నారు. తమ ఫ్యామిలీ అభిమాని  నూర్‌ అహ్మద్‌ కుటుంబానికి ఆయన 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నూర్‌ అహ్మద్‌ గారు మెగా అభిమానులందరిలో కెల్లా గొప్ప వ్యక్తి. ఆయన మా పేరు మీద ఎన్నో పర్యాయాలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారు. ఆయన లేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్‌లో ఉన్నపుడు నేను స్వయంగా ఆ హాస్పిటల్‌కు వెళ్ళి పరామర్శించి వచ్చాను.

అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించాను. నిన్న ఆయన మరణవార్త విన్న వెంటనే చలించిపోయాను. ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అన్నారు. 'అభిమాని లేనిదే హీరోలు లేరులే' అనే  మాటను మెగా ఫ్యామిలీ నిరూపించింది. గ్రేటర్ హైదరాబాద్‌ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఆకస్మిక మరణం పొందిన సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఆదివారం తన తుది శ్వాసను విడిచారు. అనేక ఏళ్లుగా అభిమానిగా ఉన్న ఆయన మరణ వార్త విని మెగా ఫ్యామిలీ షాక్ తింది. 

ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి హటాహుటిన తన అభిమాని ఇంటికి చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు కుటుంబసభ్యులను పరామర్శించి తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నూర్ మహ్మద్ తన వీరాభిమాని అని ఆయన మరణం తీరని లోటని బాధను వ్యక్తం చేశారు.

ఆయన్ని తిరిగి తీసుకొని రాలేను కానీ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులును ఓదార్చారు. అల్లు అర్జున్ కూడా స్వయంగా నూర్ అహ్మద్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గీతా ఆర్ట్స్ కూడా నూర్ జీ మరణం చాలా బాధని కలిగించిందంటూ 'అల..వైకుంఠపురములో' అప్డేట్ ను వాయిదా వేసింది. ఆదివారం మాత్రమే గాక ఈ రోజు కూడా మెగా అభిమానులు నూర్ అహ్మద్‌ మరణంపై తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle