newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

08-07-202008-07-2020 10:43:13 IST
Updated On 08-07-2020 12:27:15 ISTUpdated On 08-07-20202020-07-08T05:13:13.163Z08-07-2020 2020-07-08T05:13:04.648Z - 2020-07-08T06:57:15.677Z - 08-07-2020

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక స్టేజ్ వచ్చాక అన్ని పాత్రలు చేయడం కష్టమే. అందునా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యాక్ గ్రౌండ్ వున్న మంచు మనోజ్ చిన్న చిన్న చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు. తాజాగా యువ హీరో మంచు మనోజ్ త్రివిక్రమ్ సినిమాలో ఒక విలన్ పాత్ర చేయబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇండస్ట్రీలో కూడా అందరూ ఈ విషయం చర్చించుకోవడంతో మనోజ్ స్పందించక తప్పలేదు. అయితే విలన్ పాత్రపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. 

హీరోగా మళ్ళీ స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వాలని తాను భావిస్తున్నానని, ఇప్పుడే తనను విలన్ గా చూడాలని ప్రేక్షకులు తనను భావించడం లేదన్నాడు మంచు వారబ్బాయి,. మనోజ్ ఒక పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్నాడు. అహం బ్రహ్మాస్మి అనే కొత్త సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఆ సినిమా కోసం మంచు మనోజ్ చాలా కష్టపడుతున్నాడు. కేవలం ఫిట్ నెస్ విషయంలోనే కాకుండా నటనపరంగా కూడా కొత్తగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు.‘అహం బ్రహ్మాస్మి’ మూవీ ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. మోహన్ బాబు, మంచులక్ష్మి, చిరంజీవి కూతురు సుస్మిత, రాంచరణ్ హాజరయిన సంగతి తెలిసిందే. 

ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచు మనోజ్ ని ప్రత్యేకంగా కలిసినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నాడని, అది కూడా విలన్ పాత్ర అని అన్నారంతా.  చిన్నవయసులోనే మనోజ్ విలన్ పాత్ర పోషించడంపై విమర్శలు వచ్చాయి.  ఈ రూమర్స్ పై మంచు మనోజ్ వివరణ ఇచ్చాడు.

నాకు విలన్ పాత్రలు చేయాలని మనసులో ఉంది.. కానీ ఇప్పుడు చేయాలని లేదన్నాడు. తనకు సరైన సమయం కాదని వివరణ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం తనను ఎవరు సంప్రదించలేదని కూడా ఈ క్లియర్ గా చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. గత కొన్నాళ్లుగా మనోజ్ అప్ సెట్లో వున్నాడు. ఈసారి ఎలాగైనా విజయం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మనోజ్ విలక్షణమయిన పాత్ర పోషిస్తున్నాడు. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   9 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   13 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle