facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

అప్పుడు కథానాయకుడు... ఇప్పుడు యాత్ర!

11-02-201911-02-2019 11:32:41 IST
Updated On 11-02-2019 11:34:55 ISTUpdated On 11-02-20192019-02-11T06:02:41.166Z11-02-2019 2019-02-11T06:02:32.714Z - 2019-02-11T06:04:55.500Z - 11-02-2019

అప్పుడు కథానాయకుడు... ఇప్పుడు యాత్ర!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనవరి 9న వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు మంచి రివ్యూస్‌తో పాటు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ పాస్ మార్కులు వేశారు. దీంతో ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతుందని అనుకున్నారు. తీరా చూస్తే... రెండో రోజుకే ఆ అంచనాలు బోల్తా పడ్డాయి. ఒక్కసారిగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టడం, అదే టైంలో వేరే సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో... ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పుంజుకోలేక చతికిలపడింది. చివరికి అతి తక్కువ వసూళ్ళతో బిచాణా ఎత్తేసి... ఆల్‌టైమ్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

ఇక ఇటీవల (ఫిబ్రవరి 8న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యాత్ర’ సినిమాకూ మంచి టాక్‌తో పాటు రివ్యూస్ వచ్చాయి. కానీ... కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమాను కొద్దిమంది బయ్యర్లకే కొన్ని ఏరియాలకు తక్కువ రేటుకు అమ్మారు. మిగిలిన ఏరియాల్లో స్వయంగా నిర్మాతలే విడుదల చేశారు. ఈ చిత్రానికి అయిన నిర్మాణ ఖర్చులు తక్కువే కాబట్టి... ప్రస్తుతం నమోదవుతున్న వసూళ్ళ దృష్ట్యా ఇది బ్రేక్ ఈవెన్‌కి చేరుతుంది. కుదిరితే లాభాలు కూడా రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే... ఇక్కడ లాభనష్టాలన్నవి పెద్ద విషయం కాదు. ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల బయోపిక్‌లు... ఎందుకు ‘మహానటి’ స్థాయిలో ఆదరణ చూరగొనడం లేదన్నది మెయిన్ పాయింట్! అందుకు కొన్ని ప్రధాన కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు!‘మహానటి’ చిత్రంలో సావిత్రి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చరిత్రను ఏమాత్రం వక్రీకరించకుండా... పాజిటివ్స్, నెగెటివ్స్‌ అంశాల్ని ప్రేక్షకుల హృదయాల్ని కదిలించేలా చిత్రీకరించారు.

కానీ... కథానాయకుడు, యాత్ర సినిమాల్ని అలా తెరకెక్కించలేదు. కేవలం పాజిటివ్స్‌ని మాత్రమే హైలైట్ చేసి, డ్రామాకి పెద్ద పీట వేసి, నెగెటివ్ అంశాల్ని పక్కనపెట్టారు. అదే ఈ బయోపిక్ మేకర్స్ చేసిన అతి పెద్ద తప్పని విశ్లేషకులు వివరిస్తున్నారు. అందుకే... మౌత్ టాక్ బాగున్నప్పటికీ జనాలు ఈ రెండు చిత్రాలకు వెళ్ళడం లేదని చెప్తున్నారు. ‘మహానటి’ స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం వల్లే ఈ రెండు బయోపిక్‌లు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle