newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

అన్నం పెట్టిన చేతిని కరుస్తున్నామా జయా బచ్చన్‌జీ.. కంగనా కౌంటర్

16-09-202016-09-2020 08:23:19 IST
2020-09-16T02:53:19.575Z16-09-2020 2020-09-16T02:53:15.619Z - - 28-09-2020

అన్నం పెట్టిన చేతిని కరుస్తున్నామా జయా బచ్చన్‌జీ.. కంగనా కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంతవరకు మహారాష్ట్ర ప్రభుత్వం మీద, బాలీవుడ్‌లో డ్రగ్ సంస్కృతి మీద విరుచుకుపడుతూ వచ్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ నటి అయిన జయాబచ్చన్‌ని టార్గెట్ చేసుకున్నారు. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ రాకెట్ మయమైందని బీజేపీ ఎంపీ రవి కిషన్ పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ పరుష వ్యాఖ్యలతో ఖండించారు. అన్నం పెట్టిన చేతినే కరవాలంటే ఎలా అంటూ బాలీవుడ్‌ని సమర్థించిన జయా బచ్చన్‌ను కంగనా ప్రశ్నించారు. మీ అమ్మాయి ఇదే విధంగా డ్రగ్స్‌క్ బానిసై, మీ అబ్బాయి వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే కూడా ఇలాగే మాట్లాడతారా జయాజీ అంటూ కంగనా చురకలు అంటించారు.

బాలీవుడ్‌లో సుశాంత్‌ సింగ్‌ మరణం తర్వాత డ్రగ్స్‌ కలకం మొదలయింది. ఇటీవలే నటుడు, యంపీ రవి కిషన్‌ ‘డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి. దోషుల్ని పట్టుకొని విచారణ జరపాలి’ అని ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని పార్లమెంట్‌లో వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్‌ను ఉద్దేశిస్తూ సీనియర్‌ నటి, యంపీ జయాబచ్చన్‌ మాట్లాడారు. ‘‘కొంతమంది అన్నం పెట్టిన చేతినే కరవాలనుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి అండగా ప్రభుత్వం నిలబడాలి. ఎలాంటి విపత్తులు వచ్చినా ఇండస్ట్రీ తన వంతు సహాయం చేసింది. కొందరు చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ తప్పు అనే ఇమేజ్‌ తీసుకురావడం కరెక్ట్‌ కాదు’’ అని జయ అన్నారు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు జయ మాట్లాడిన విషయాన్ని కొనియాడారు. కంగనా రనౌత్‌ మాత్రం జయతో ఏకీభవించలేదు. ‘‘జయాజీ, మీ అమ్మాయి శ్వేతా బచ్చన్‌ కూడా టీనేజ్‌లో డ్రగ్స్‌కి బానిసయి, లైంగిక వేధింపులకు గురైతే ఇలానే మాట్లాడతారా మీ అబ్బాయి అభిషేక్‌ కూడా అదే పనిగా హెరాస్‌మెంట్‌ ఎదుర్కొని, ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటే ఇలాంటి స్టాండే తీసుకోగలరా కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. కొంచెం దయ చూపించండి’’ అని జయా బచ్చన్‌ వీడియోను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు కంగనా.

సుప్రసిద్ధ కొరియాగ్రాఫర్ గతంలో మాట్లాడిన మాటలను కంగనా గుర్తు చేసారు. రేప్ జరిగితే జరిగింది. నీకు బాగానే డబ్బు ముట్టింది కదా అని ఆ కొరియో గ్రాఫర్ అన్న మాటలను కంగనా గర్తు చేస్తూ ఇలాంటి సంస్కృతినే జయాబచ్చన్ కాపాడదలిచారా అంటూ కౌంటర్ వేశారు.

పేదవాళ్లకు కాస్త రొట్టెముక్కలు పడేస్తే చాలు. వారినేమి చేసినా తప్పులేదు అనే మనసత్వాన్ని మనం మార్చాల్సి ఉందని కంగనా పేర్కొన్నారు.  బాలీవుడ్‌లో సాధారణ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులకు కేంద్ర ప్రభుత్వం ఏవిధమైన సంస్కరణలు అందించాలా మొత్తం జాబితా అంతా నావద్ద ఉంది. ఏదో ఒకరోజు గౌరవనీయ ప్రధాని నరేంద్రమోదీని కలుస్తాను. వారి సమస్యల గురించి నేను ప్రస్తావిస్తాను అని కంగనా పేర్కొన్నారు.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను కూడా రియా విచారణలో వెల్లడించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌సీబీ త్వరలో సారా, రకుల్‌, సిమోన్‌లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. 

ప్రస్తుతం సుశాంత్‌ గెస్ట్‌ హౌజ్‌, పావనా డ్యామ్‌ ద్వీపంలోని పార్టీలపై ఎన్‌సీబీ దృష్టి చారించింది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‌డ్రగ్‌ కేసులో సారా అలీ ఖాన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిమోన్‌ ఖంబట్టాలు దర్యాప్తులో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా వారికి సమన్లు జారీ చేయలేదని, త్వరలో పంపించే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

 

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

బాలు ఆసుపత్రి బిల్లు వివాదం.. వివరణ ఇచ్చిన ఎస్పీ చరణ్

   an hour ago


సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

సమంత, కాజల్, తమన్నాల బాటలో.. శృతిహాసన్!

   5 hours ago


పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

పవన్ తో బండ్ల గణేష్ మూవీ.. ఇంతకీ.. డైరెక్టర్ ఎవరు..?

   5 hours ago


91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

91వ వసంతంలోకి అడుగుపెట్టిన గాన కోకిల 'లతామంగేష్కర్'

   6 hours ago


బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్4: బిగ్ బాస్ రికార్డ్స్ సాధించిన కంటెస్టెంట్స్..

   7 hours ago


నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

నా బాస్ ఓకే అన్నారు.. పవన్ తో బండ్లగణేష్ మూడో సినిమా..

   8 hours ago


క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ వాడతారు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..

   8 hours ago


విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం నిజమేనా?

   8 hours ago


బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

బాలుని ఖననం చేసిన ప్రాంతంలోనే..ఆయన స్మారక మందిరం..

   9 hours ago


ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ టాక్ ఏంటి..?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle