newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

అనుష్క కండిషన్స్ కు చిత్ర యూనిట్ షాక్..

08-01-202008-01-2020 07:59:39 IST
2020-01-08T02:29:39.978Z08-01-2020 2020-01-08T02:29:15.595Z - - 17-01-2020

అనుష్క కండిషన్స్ కు చిత్ర యూనిట్ షాక్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అందంతో బాటు అభినయంతో స్టార్ హోదా దక్కించుకున్న నటి అనుష్క. అరుంధతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది స్వీటీ అనుష్క. అంతేకాదు, లేడీ ఓరియెండెట్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని కూడా క్రియేట్ చేసింది. ఒకవైపు ఇలాంటి సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ గా కూడా కనిపిస్తూ హీరోల సరసన స్టెప్పులు కూడా వేసింది.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆమె నటించిన 'బాహుబలి' సినిమా అనుష్కను మరో లెవెల్ కు చేరింది. అశోక్ దర్శకత్వంలో 'బాగమతి' సినిమాలో ఆమె చూపిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్లామర్ పాత్రలు వేయడానికి నో చెప్పిన అనుష్క లేడీ సెంట్రిక్ పాత్రలను మాత్రమే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ కోవలోనే అనుష్క నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

అయితే,  ఈసినిమా ప్రచారంలో పాల్గొనేందుకు అనుష్క సిద్ధంగా లేదట.  మీడియా ముందుకొచ్చి మాట్లాడేందుకు అనుష్క నో చెప్తోందని అంటున్నారు. ఎందుకంటే,  సోలోగా ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు సుముఖంగా లేరని సమాచారం. వ్యక్తిగత ప్రశ్నలకు దూరంగా ఉండేందుకే అలా చేస్తోందట.  వ్యక్తిగత ప్రశ్నలతో బాటు తనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అనుష్క మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

అనుష్క పెట్టిన ఈ కండిషన్స్ తో చిత్ర యూనిట్ షాక్ కు గురైందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.  అయితే, చిత్రయూనిట్ మాత్రం స్పెషల్ గా అనుష్క ఇంటర్య్వూస్ ని నిర్వహించి దానిని మాత్రమే అన్నీ మీడియాలకి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

లేడీ సెంట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా థ్రిల్లింగ్ అంశాలతో మనలని థ్రిల్ చేస్తోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అంజలీ, షాలిని పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మాడ్ సన్ కూడా నటించాడు. గోపి సుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని కోన వెంకట్, విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. డెఫ్ అండ్ డమ్ క్యారెక్టర్ లో అనుష్క నటిస్తున్న ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle