newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

అనుష్క `నిశ్శ‌బ్దం` రిలీజ్ డేట్ ఫిక్స్ ..

03-12-201903-12-2019 08:14:22 IST
Updated On 03-12-2019 08:16:11 ISTUpdated On 03-12-20192019-12-03T02:44:22.342Z03-12-2019 2019-12-03T02:42:51.739Z - 2019-12-03T02:46:11.224Z - 03-12-2019

అనుష్క `నిశ్శ‌బ్దం` రిలీజ్ డేట్ ఫిక్స్ ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, మైఖేల్ మాడిసెన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజ్ ప్రధాన పాత్రలలో నటించారు.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ జరుపుకుంటోంది.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2020  జ‌న‌వ‌రి 31న  విడుద‌ల చేస్తామ‌ని చిత్ర నిర్మాతలు ప్ర‌క‌టించారు. 

ఈ సందర్భంగా కోన వెంక‌ట్ మాట్లాడుతూ " దర్శకుడు హేమంత్ మధుకర్ మంచి కథను సిద్ధం చేశాడు. అమెరికాలోనే మొత్తం సినిమాను చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదేన‌ని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. ముందుగా ఈ సినిమా కోసం వేరే హీరోయిన్ ను అనుకున్నాం.

కానీ ఆమెకు వీసా సమస్యల వల్ల ఈ సినిమా నుండి తప్పుకుంది. ఈ సినిమా కథను ఎయిర్పోర్ట్ లో అనుష్కకు చెప్పాను. ఆమె ఈ కథ విని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడ‌లేదు. చెవులు విన‌ప‌డ‌వు. అందుకే ఈ సినిమాకు `నిశ్శ‌బ్దం` అనే టైటిల్‌ను పెట్టాం. గోపి సుందర్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి హైలైట్ కానుందని" అన్నారు. 

Image

నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ " నేను, హేమంత్ మంచి ఫ్రెండ్స్. ముందుగా ఈ కథను హేమంత్ నాకు విమానంలో వినిపించాడు. నాకు డిఫరెంట్ పాత్రను ఇచ్చిన చిత్ర యూనిట్ కు నా థాంక్స్" అని అన్నారు. 

డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ – నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ దొరకడం మా అదృష్టం. ఆయన అన్నీ సమకూర్చారు. యాక్టర్స్ అందరూ చాలా అద్బుతంగా చేశారు.  జ‌న‌వ‌రి 31న ఈ సినిమాను విడుద‌ల చేస్తాం.సినిమా అంద‌రికీ నచ్చుతుందని న‌మ్ముతున్నాను“ అన్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle