newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

11-07-202011-07-2020 12:23:13 IST
Updated On 11-07-2020 12:41:52 ISTUpdated On 11-07-20202020-07-11T06:53:13.977Z11-07-2020 2020-07-11T06:53:06.202Z - 2020-07-11T07:11:52.392Z - 11-07-2020

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ కెరీర్ లో దూసుకుపోయాడు. సాహో మూవీ అనుకున్నంతగా సక్సెస్ తేలేదు. కానీ ప్రభాస్ రేంజ్ తగ్గలేదు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న మూవీ 20 ఫస్ట్ లుక్ గురించిన ప్రచారం భారీస్థాయిలో జరిగింది. సోషల్ మీడియాలో 'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ పోస్టర్ హంగామా నడుస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే ఈ పోస్టర్ 6.3 మిలియన్లకు పైగా ట్వీట్స్ సాధించింది. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ ట్విట్టర్ వేదికపై తెగ హంగామా చేస్తోంది. 

సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్ని ట్వీట్స్ సాధించిన ఫస్ట్‌లుక్‌గా రికార్డు సృష్టించిన ఈ పోస్టర్ తాజాగా మరో మైలురాయి దాటేసింది. డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్‌లుక్ తోనే ఈ రేంజ్ సంచలనాలు సృష్టిస్తుండటం పట్ల రెబల్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

'రాధే శ్యామ్' ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ప్రభాస్- పూజా హెగ్డే బార్బిడాల్ డ్యాన్స్ మూమెంట్‌తో ల‌వ్‌లీగా రొమాంటిక్ స్టిల్ ఇచ్చి కనువిందు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ గతంలో వచ్చిన 'కంచె' సినిమా పోస్టర్‌ని పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. అయినప్పటికీ తనదారిలో తానూ వెళ్తూ రికార్డుల వేట మొదలెట్టింది 'రాధే శ్యామ్' మూవీ పోస్టర్. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 1960 దశకం నాటి ప్రేమకథతో ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రొమాంటిక్ కిక్ ఇచ్చారు.సాహో తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నఈచిత్రం ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి. 

మాస్కులతో మార్ఫింగ్

ఇదిలా ఉంటే.. అసోం పోలీసులు ఈ పోస్టర్ కోవిడ్ 19 నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆలోచనతో   సినిమా పోస్టర్‌ కి మార్ఫింగ్ చేయడంతో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది.తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజైన రాధేశ్యామ్ సినిమా పోస్టర్‌ అసోం పోలీసులను ఆకర్షించింది. కోవిడ్ 19 నిబంధలకు అనుగుణంగా లేదనే విషయాన్ని గ్రహించిన నాగావ్ పోలీసులు ఆ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఫోటో షాప్ ద్వారా మాస్క్ ధరించిన పోస్టర్‌ను రిలీజ్ చేయాలని సూచించడానికి ప్రభాస్‌ను సంప్రదించగా.. సాధ్యం కాలేదు అని తెలిసింది. దీంతో వారే ఆపోస్టర్ కు మాస్క్ టచ్ ఇచ్చారు. రాధేశ్యామ్ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి నాగావ్ పోలీసులు తమ ట్విట్టర్‌లో పోస్టు చేసి ఓ కామెంట్‌ను కూడా పెట్టారు. మీకు ప్రియాతి ప్రియమైన వ్యక్తులు బయటకు వెళ్లుంటే... తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పండి. మేము అదే విషయాన్ని ప్రభాస్ తెలియజేయడానికి ప్రయత్నించామని అది కుదరలేదని, ఫోటోషాప్‌ ద్వారా ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయనకు మెసేజ్ పంపారు. 

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   9 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   13 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle