newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

అదరగొడుతున్న సైరా టీజర్... ఫ్యాన్స్ గూస్ బంప్స్

20-08-201920-08-2019 14:56:17 IST
Updated On 20-08-2019 15:07:01 ISTUpdated On 20-08-20192019-08-20T09:26:17.792Z20-08-2019 2019-08-20T09:26:16.046Z - 2019-08-20T09:37:01.792Z - 20-08-2019

అదరగొడుతున్న సైరా టీజర్... ఫ్యాన్స్ గూస్ బంప్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా'. ఈ చిత్ర టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు అమిత్ త్రివేది ఇచ్చిన నేపధ్య సంగీతం గూస్ బంప్స్ తెచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్ కు స్పెషల్ గా నిలిచింది. సైరా నర్సింహారెడ్డి… మెగాస్టార్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది… ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

సైరా నర్సింహారెడ్డి సినిమా ఎలా ఉండబోతోంది.. క్యారెక్టర్స్ ఏంటి అనేది ఈ టీజర్ లో చూపించారు. సినిమా రేంజ్, మెగాస్టార్ పెర్ఫామెన్స్, హై ఓల్డేజ్ యాక్షన్ కి సిద్ధంగా ఉండమని చెప్తోంది ఈ టీజర్.లాస్ట్ మెగాస్టార్ గుర్రంపైనుంచి దిగిన క్లోజ్ షాట్ అద్బుతంగా ఉంది.

ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు మెగాస్టార్ చిరంజీవి. పూర్తి ఫిటినెస్ తో హార్స్ రైడింగ్ చేస్తుంటే ఆడియన్స్ కి గూస్ బమ్స్ వస్తున్నాయి. చరిత్ర స్మరించుకుంటుంది… ఝూన్సీలక్ష్మీభాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ల ప్రాణత్యాగాలని కానీ, ఆ చరిత్రపుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు.. అనగానే మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చాడు.. ఇక్కడ మెగాస్టర్ లుక్ చూసి ఫ్యాన్స్ పిదా అయిపోయారు.

సింహం లాంటోడు దొర.. అతడే వాళ్ల దైర్యం దొర అంటూ అన్నప్పుడు టీజర్ పీక్స్ కి వెళ్లింది… ఇక చిరంజీవి వాయిస్ వేలాది వీరులారా… అంటూ వచ్చినపుడు , కత్తలుని కాళ్లతో లేపుతూ చిరంజీవి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. ఇక బిగ్ బీ అమితాబ్, కిచ్చసుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, జగపతిబాబు ఇలా వరుసగా టీజర్లో మనకి కనిపిస్తున్నారు.

ఇక కరెక్ట్ గా చిరంజీవి ఎగిరి శత్రువుల తలలో కత్తి దింపిన షాట్ గూస్ బంమ్స్ తెప్పిస్తోంది.ఓవర్ ఆల్ గా సైరా నర్సింహారెడ్డి హై ఓల్టేజ్ యాక్షన్ అని చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఇప్పుడు ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలో పండగ చేస్కుంటున్నారు.. సినిమా బంపర్ హిట్ అని కామెంట్స్ చేస్తున్నారు.  ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు టీజర్ చివరలో చూపడంతో మెగా అభిమానుల సంతోషానికి హద్దే లేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దాదాపు 250 కోట్లతో కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మించారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle