newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

అదరగొడుతున్న బుట్టబొమ్మ వీడియో సాంగ్

25-02-202025-02-2020 16:22:00 IST
Updated On 25-02-2020 18:39:08 ISTUpdated On 25-02-20202020-02-25T10:52:00.971Z25-02-2020 2020-02-25T10:51:55.785Z - 2020-02-25T13:09:08.695Z - 25-02-2020

అదరగొడుతున్న బుట్టబొమ్మ వీడియో సాంగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్రాంతికి విడుదలైన బన్నీ మూవీ అల వైకుంఠపురములో ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఈమూవీలో సాంగ్స్ అన్నీ ఆబాలగోపాలాన్ని అలరించాయి. ఈ మూవీలో బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా సాంగ్ ఫుల్ వీడియో విడుదలై యూట్యూబ్ ని ఊపేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్. టబు కీలక పాత్రలో నటించి మెప్పించారు.

సీనియర్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఏదైనా పాటకు సాహిత్యం అందిస్తే ఎంతైనా సిరివెన్నెల సిరివెన్నెలే అని మనం గొప్పగా చెబుతున్నాం. ఆయన శిష్యుడు రామజోగయ్య శాస్త్రి కూడా అచ్చమైన తెలుగు పదాలతో అందరికీ అర్థమయ్యే సాహిత్యాన్ని అందించారు. ఈ మూవీకి కూడా ఆయన అందించిన సాహిత్యం అందరినీ అలరిస్తోంది.

ఇప్పటికే తెలుగులో చాలా పాటలు రాసి సీనియర్ గేయ రచయితగా కొనసాగుతున్న రాంజీ తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమాలో ‘బుట్టబొమ్మ’ అనే పాటను రాశారు. చాలా సరళమైన, అర్థవంతమైన పదాలతో రాంజీ ఈ పాటను రాశారు. అంతే అందంగా తమన్ ఈ పాటను స్వరపరిచారు. యువ గాయకుడు అర్మాన్ మాలిక్ అద్భుతంగా ఆలపించడంతో పాట వచ్చిందంటే చాలు థియేటర్లో ఈలలే ఈలలు. బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle