newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

వింత వ్యాధితో అక్కాచెల్లెళ్ళ జీవన పోరాటం

14-02-202014-02-2020 10:17:41 IST
2020-02-14T04:47:41.066Z14-02-2020 2020-02-14T04:47:35.873Z - - 24-02-2020

వింత వ్యాధితో అక్కాచెల్లెళ్ళ జీవన పోరాటం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెళ్లయ్యాక పిల్లలు కలగాలని ఆలుమగలు కోరుకుంటారు. సంతానం కలిగాక వారి భవిష్యత్‌పై ఎన్నో కలలు కంటారు.  ఆ దంపతులు కూడా గతంలో అలాగే కలలు కన్నారు. కాని వీరి ఊహలకు భిన్నంగా విధి మరో రాత రాసింది. పుట్టిన ఇద్దరు పిల్లలు పాఠశాల విద్య చదువుకుంటున్న సమయంలో అంగవైకల్యంతో కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు.

ఇది జరిగి 22 సంవత్సరాలయింది. నాటి నుండి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల సేవలోనే బతుకు సాగదీస్తున్నారు. ఈ హృదయ విదారక ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలో కనిపించింది. వీరి వైద్యం కోసం సాయం చేయాలని ఆ తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు.

కర్రి వరహాలరెడ్డి, లక్ష్మిప్రభావతిలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నాగలక్ష్మి శారదాదేవి (34), చిన్న కుమార్తె జయసాయిశ్రీ(22). పుట్టినప్పుడు బాగానే వున్నారు. తరవాత వీరికి జన్యుపరమయిన వ్యాధి సోకింది. చిన్నతనం నుంచి ఇప్పటివరకూ అన్నీ తానే పెంచుతున్నారు తల్లిదండ్రులు. సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle