newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్..మీరు చూశారా?

29-07-201929-07-2019 17:00:15 IST
2019-07-29T11:30:15.729Z29-07-2019 2019-07-29T11:30:10.276Z - - 20-09-2019

రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్..మీరు చూశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజురోజుకీ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి.వాననీటి వృధాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, మేఘంనుంచి రాలిపడ్డ ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టాలని పర్యావరణ వేత్తలు, ప్రముఖులు నొక్కిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ విధానాలు, వాననీటి సేకరణ గురించి  తెలుసుకునేందుకు హైదరాబాద్ నగరంలో ఓ థీమ్‌ పార్కు ఏర్పాటుచేసింది వాటర్ బోర్డు. జనానికి అవగాహన కల్పించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతగానో తోడ్పడుతోంది. 

వాన నీటి సంరక్షణపై ఆసక్తి కలిగినవారు తప్పనిసరిగా రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్కును సందర్శించాలి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 51లో జలమండలి ఆధ్వర్యంలో కొండలతో ఉన్న ప్రాంతాన్ని 1.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వర్షపు నీటిని దాచేందుకు వీలుగా 42 రకాల వినూత్న విధానాలను వివరిస్తున్నారు.

రామోజీ రావు కోడలు విజయేశ్వరి, రామోజీ ఫిల్మ్ సిటీ  అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరత్నం, డైరెక్టర్ శివరామకృష్ణ ఈ థీమ్ పార్క్‌ని  సందర్శించారు. ఈ పార్కు ఎంతో ఉపయుక్తంగా ఉందని,  విద్యార్ధులకు, సంస్థలకు నీటి నిల్వ పద్ధతులను తెలియచేసేలా ఉందన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle