newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

మేరా భారత్ మహన్ !

14-08-201914-08-2019 19:22:13 IST
Updated On 14-08-2019 19:23:12 ISTUpdated On 14-08-20192019-08-14T13:52:13.560Z14-08-2019 2019-08-14T13:36:37.982Z - 2019-08-14T13:53:12.712Z - 14-08-2019

మేరా భారత్ మహన్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డెబ్బై మూడేళ్ళ స్వతంత్ర భారత్ ..మేరా భారత్ మహాన్! సంతోషం,గర్వం,స్వాభిమానం,స్వావలంబన ఇవన్నీ కలగలిపిన ఒకప్పటి మేరా భారత్ మహాన్ ! 

లేటెస్ట్ స్టాటిస్టిక్స్.. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అయిదుగురు వ్యక్తుల్లో ఒకరు మహా క్రిమినల్. తీవ్రమైన నేరస్థుడు. వీళ్లంతా హేయమైన..అమానుషమైన నేరచరిత్ర కలిగిన వ్యక్తులంటూ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఒక స్వతంత్ర సర్వే ఒలకబోసుకున్న నిజాలు చెప్తున్నాయి. అంటే ఎన్నికల బరిలో ఉన్న 19 శాతం మంది అభ్యర్థులు దారుణమైన క్రిమినల్ కేసులున్న వాళ్ళు. మన  ఎన్నికల చట్టాలు.. నిబంధనల ప్రకారం హత్యలు, మానభంగాలు చేసిన ఒక వ్యక్తిని  కోర్టు దోషిగా నిర్ధారిస్తే .. అదే వ్యక్తికి రెండు లేదా అంతకు మించిన కాలానికి శిక్ష పడితే తప్ప ఆ వ్యక్తి పోటీకి అర్హుడు కాదు. 

నిజమే.. వీళ్ళందరికీ కోర్టుల్లో శిక్షలు పడడానికి పట్టే  కాలమెంత ? కనీసం 15-20 ఏళ్ళు సగటు సమయమన్నది మన క్యాలెండర్లు చెప్తున్న సాక్ష్యం. ఈలోపు వాళ్లంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అయిపోతారు. థట్స్ ఔర్ ఇండిపెండెంట్ ఇండియా..! ఇక ఇక్కడ తయారయ్యే చట్టాలు ఎంత గొప్పగా ఉంటాయో మనం ప్రతిరోజూ చూస్తున్నదే..!

నెక్స్ట్ కమ్స్ ఔర్ ఎగ్జిక్యూటివ్.. బ్యూరోక్రసీ మన పాలనా యంత్రాంగం .. ! ఇందులో మంత్రులైన వాళ్ళూ వాళ్లకు సహాయంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ సంగతేంటి ? చేసిన చట్టాల్ని అమలు చెయ్యాల్సిన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఖర్చు చేసే ప్రతీ రూపాయిలో  86 పైసలు ముందే కరిగిపోతుంది. జేబుల్లోకి పోతోంది. మిగతా 14 పైసలుకూడా అనుమానమే ! ప్రభుత్వ శాఖలతో ప్రమేయం లేకుండా సామాన్యుడి బతుకు గడవదు. పింఛన్ల నుంచి మొదలు పెట్టి భూముల పత్రాల దాకా.. జనన మరణాల ధ్రువీకరణ పత్రాల నుంచి ఆసుపత్రిలో చేరి వైద్య సదుపాయాలూ పొందేదాకా.. అన్నీ లంచాలతోనూ  ..అవినీతితోనూ ముడేసుకున్న నేపధ్యాలు మనవి. 

ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ సంస్థ లెక్కల పాత ప్రకారమే మన దేశంలో 92 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులకు  ఎప్పుడో ఒకప్పుడు..ఏదోరకంగా..దేనికో ఒకదానికోసం లంచాలు ఇచ్చిన అనుభవాలుంటాయి. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజ్జంగా నిజమని గట్టిగా అరిస్తే.. ? వినేవాడెవడు ? 

ఇక చేతిలో త్రాసు పట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకుని సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్న మన న్యాయ దేవత ముందు పేరుకుపోయిన ఫైళ్ల లెక్కలు తెలుసా.. దాదాపు మూడు కోట్ల పైనే ! ఈ నెంబర్ ప్రతీ గంటకూ పెరుగుతుందన్న విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ న్యాయస్థానాల సంగతి పక్కన పెడితే.. సిబిఐ కోర్టులు, ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్లు, ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంటులు  వీటితోబాటు వందలాది ట్రిబ్యునళ్ళూ ప్రతీ రోజూ చేస్తున్న దర్యాప్తులు.. విచారిస్తున్న కేసుల కుప్పలువేరే !ఇవికాకుండా ఎలెక్షన్లప్పుడు పట్టుపడిపోయే కోట్లాది రూపాయల కరెన్సీ కట్టలు..చెత్తా చెదారం మళ్ళీ వేరే ! 

పట్టుబడే డబ్బు, లిక్కర్, బంగారం వగైరా వగైరా కేసులన్నీ ఏమవుతున్నాయి? ఎప్పటికి పరిష్కారమౌతాయి? 83 శాతం లెక్కల ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తుల ప్రకారం కోటీశ్వరులైన వాళ్ళు 83 శాతం మంది పైనే ! వీళ్లంతా ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు ఆ ఎలక్షన్ కమిషన్ విధించిన పరిమితుల ప్రకారమే జరుగుతోందా?

ఎంతమంది ఎంపీలు సగటున 50 కోట్ల పైనే ఖర్చు చేస్తున్నారు? వాళ్ళు సమర్పిస్తున్న ఎలెక్షన్ అఫిడవిట్లలో డిక్లరే చేసే ఆస్తులు..ఇతర వివరాలన్నీ అబద్దాలే అన్న మాటల్లో నిజాల్ని బయటకు తీసే వ్యవస్థ ఎక్కడ ?  అక్కడ అవినీతి జరగడంలేదా? అసలీ అవినీతి న్యాయాధికారులు, అధికారుల మీద కేసులేమౌతున్నాయి? లెక్కలు తీయండి ! 

ఇక చివరిగా ఫోర్త్ ఎస్టేట్ అంటూ కాలర్లెగరేస్తున్న మీడియా సంగతేటి ? ఈ మీడియాలోకి డబ్బెక్కడ నుంచి వస్తోంది? పెట్టుబడులు ఎవరు పెడుతున్నారు? వాటాలు కొమ్ముకాస్తున్న రాజకీయ పార్టీలు ఏవి ? వాళ్ళ కార్పొరేట్ మూలాలు ఎక్కడున్నాయి? గత పది పన్నెండు సంవత్సరాల్లో మీడియా సంస్థల్లో పెరిగిన కార్పొరేట్ పెట్టుబడుల శాతమెంత?  పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీవీ చానెళ్లు, పత్రికలూ ఒకవైపైతే..ఇప్పుడు సోషల్ మీడియా పేరుతో విచ్చలవిడిగా వస్తున్న పెట్టుబడులకు కార్పొరేట్ మూలాలు లేవా? ఇక ఈ పత్రికలూ,టీవీ చానెళ్లు ప్రజలకవసరమైన వార్తలు.. నిజమైన వార్తలు చెప్తాయని ఎందుకాశించాలి? 

ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన లెజిస్లేచర్.. ఎగ్జిక్యూటివ్ ..జ్యూడిషియరీ.. శాసన,కార్యనిర్వాహక,న్యాయ వ్యవస్థలే కుదేలైపోతుంటే ఇక ఇదే ప్రజాస్వామ్యానికి తాము నాలుగో స్తంభమంటూ పెద్దగా అరుస్తున్నమీడియా కూడా ఎప్పుడో బీటలువారి..ఏదో ఒకరోజు కూలిపోవడానికి రెడీగా ఉంది.

మేరా  భారత్ మహాన్.. సారీ మేరా భారత్ కహాన్ ???


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle