newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

మృగాళ్ళ తోలు తీయడానికి దమ్మూ, ధైర్యం లేదా?

02-12-201902-12-2019 16:50:00 IST
Updated On 02-12-2019 16:49:58 ISTUpdated On 02-12-20192019-12-02T11:20:00.181Z02-12-2019 2019-12-02T10:39:12.297Z - 2019-12-02T11:19:58.621Z - 02-12-2019

మృగాళ్ళ తోలు తీయడానికి దమ్మూ, ధైర్యం లేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్కూలుకి వెళ్లి తమ కూతురు తిరిగి రాకపోతే ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. అలాంటిది హాస్టళ్ళో ఉన్న కూతురు ఉరి వేసుకుని చనిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవాలన్నారు. సుగాలి ప్రీతి విషయంలో ఆధారాలున్నా.. ఎలాంటి న్యాయం చేయలేకపోయారని మండిపడ్డారు. తాను కూడా ఇద్దరు ఆడబిడ్డల తండ్రినని.. ప్రీతి తల్లి దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయానన్నారు. అత్యాచారాల విషయంలో కుల, మత, ప్రాంతాల గురించి ఆలోచించకూడదన్నారు. కొన్నేళ్ల క్రితం వరంగల్‌లో యాసిడ్ బాధితురాలు స్వప్నికను చూడ్డానికి వెళ్లానని.. కాలిన గాయాలతో ఉన్న ఆమె.. ఇంకెవరికీ ఇలాంటి కష్టం రాకూడదని చెప్పిందని ఆనాటి సంగతి గుర్తు చేసుకున్నారు. 

సుగాలి ప్రీతి కేసులో ఏమయింది? జగన్ కి చిత్తశుద్ధి లేదా? ఆమె బాధ ఎవరు తీరుస్తారు. సామాన్య గృహిణి బిడ్డను చంపేస్తే ఆమె నిస్సహాయురాలైంది. ఆమెను ఆదుకునే వ్యవస్థ లేదా అన్నారు పవన్ కళ్యాణ్. ఆడబిడ్డల మానప్రాణాలను సంరక్షించుకోలేకపోతే.. 151 సీట్లు ఇచ్చి ప్రయోజనమేంటని వైసీపీ నేతలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

సమాజంలో మహిళలపట్ల హింస పెరిగిపోవడానికి కఠిన శిక్షలు లేకపోవడమే కారణం అన్నారు. ఏదైనా తేడా చేస్తే చంపేస్తారన్న భయం మృగాళ్లకు ఉండాలన్నారు. లేకపోతే ఆడ పిల్లలకు రక్షణ ఉండదన్నారు. డబ్బులున్నవారు ఛస్తే ఒక న్యాయం. డబ్బు లేనివారు పోతే ఇంకో న్యాయం. ఇదే మన పాలకుల ధర్మసూత్రం అన్నారు పవన్. మృగాళ్ళ తోలు తీయడానికి ధైర్యం లేదా? అని పవన్ ప్రశ్నలు సంధించారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle