newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

మీ ఎమ్మెల్యేలను ఆపుకోలేక మాపై ఏడుపెందుకు?

18-07-201918-07-2019 18:01:47 IST
Updated On 18-07-2019 18:23:32 ISTUpdated On 18-07-20192019-07-18T12:31:47.874Z18-07-2019 2019-07-18T12:08:30.713Z - 2019-07-18T12:53:32.525Z - 18-07-2019

మీ ఎమ్మెల్యేలను ఆపుకోలేక మాపై ఏడుపెందుకు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం కేసీఆర్-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో కలుపుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు.

అయితే భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటరిచ్చారు. రాజ్యాంగబద్ధంగానే విలీనం జరిగిందని అన్నారు. నిబంధనల ప్రకారమే టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం జరిగిందని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేసుకోలేక మాపై నిందలు వేస్తారా అని కేసీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

రాజ్యాంగంలో కొన్ని నిబంధలు ఉన్నాయని, ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారాలు జరుగుతాయని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం టీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు.

టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలో చేరతామని వచ్చారని.. తాము చేర్చుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తమకు కావలసిన మెజారిటీ ఉందని చెప్పామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావాలనే తమ పార్టీలోకి వచ్చారన్నారు. ఇటీవల టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేశారు. గోవాలో కూడా కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో చేరినప్పుడు మీరేం చేశారని కేసీఆర్ నిలదీశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle