facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

మన తెలుగు వీణ

15-03-201915-03-2019 19:31:39 IST
2019-03-15T14:01:39.264Z15-03-2019 2019-03-15T14:01:37.156Z - - 20-04-2019

మన తెలుగు వీణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన తెలుగు రాష్ట్రాలు ఎన్నో అద్భుతమయిన కళలకు ఆలవాలం.  కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం, ఎన్నో వెలుగు చూడని కళలు మన సొంతం. అటువంటి కళలను, దేవాలయాలను, కళాకారులను , వాయిద్యాలను ఒక్కసారి ఈనాటి యువతరానికి పరిచయం చేయాలనే ప్రయత్నంలో , ముందుగా ‘న్యూ‌స్ స్టింగ్’  టీం విజయనగరం జిల్లాని ఎంచుకుంది. అందులో భాగంగా ఈ వారం మీ ముందుకి తీసుకుని వస్తున్నాము బొబ్బిలి వీణ ! బొబ్బిలి అనగానే మనకి గుర్తొచ్చేది బొబ్బిలి వీణ. ఆ బొబ్బిలి వీణ గురించి మరొక్కసారి మననం చేసుకోవడానికి ముందు మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అవసరం. 

ఒకప్పుడు చదవడానికి మనకి హార్డ్ కాపీ పుస్తకాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు చదవటానికి డిజిటల్ బుక్స్ ,స్మార్ట్ ఫోన్ , ఐపాడ్‌లలోనే చదువుకునే పుస్తకాలు ఉంటున్నాయి. లైబ్రరీలకి వెళ్లే అవసరం లేకుండానే ఒక మొబైల్ లైబ్రరీనే మన వెంట పెట్టుకుని నడిచే రోజులు వచ్చేశాయి. సంగీతం ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే మనకి జ్ఞాపకం వచ్చేవి వయోలిన్, తబలా, మృదంగం, నాదస్వరం, వీణ లాంటివి.  ఇంట్లో ఎవరో ఒకరు ఒక ఒక వాయిద్యాన్ని నేర్చుకుంటే  కుటుంబమంతా కూర్చుని వాళ్ళు వాయించేది విని ఆనందించేవాళ్ళం.  కానీ అదే స్థానంలో ఇప్పుడు చెవిలో పెట్టుకుని వినేలా హ్యాండ్సఫ్రీ రావటం, ఎవరికీ కుటుంబంతో కూర్చుని ఆనందించే సమయం లేకపోవటం, అంతే  కాకుండా చదువు ముందు.. తరవాత అనే పేరెంట్స్ మధ్య ఆనాటి వాయిద్యాలు కూడా మరుగున పడిపోయాయన్నది నమ్మలేని చేదునిజం. 

వీణ,వయొలిన్, మృదంగాలు అరుదుగా వినిపిస్తున్నాయి. నేర్చుకోవటానికి కూడా అంతగా శ్రద్ధ కనబరచడం లేదు. వీటికి బదులుగా ఇప్పుడు కీ బోర్డు, ఎలక్ట్రిక్ గిటార్, లేదా సాఫ్ట్‌వేర్‌తోనే సంగీతాన్ని సమకూర్చి అందించే సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవైపు సాంకేతిక అభివృద్ధి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తి, అమితానందపరచినా మరో వైపు కొన్ని విషయాల్లో అభివృద్ధి బాధను మిగిల్చిందనే చెప్పాలి. 

అలా  మరుగున పడిన మన వాయిద్యాలని గుర్తుచేసుకోవాలనే ప్రయత్నంలోనే  మా ఈ బొబ్బిలి ప్రయాణం.   వీణ చాలా పురాతనమైన వాయిద్యం. భరతుడు తన నాట్యశాస్త్రంలో వీణను గురించి ప్రస్తావించారు. రుగ్వేద , సామవేద సాహిత్యాలైన తైత్తరీయ సంహిత అను గ్రంథాలలో వీణ గురించి లిఖించబడినది. అంతేకాకుండా వీణని మొదటిగా వాడిన ఘనత నారదునికి  దక్కింది. వీణని ఆయా ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో సంబోధించారు. వాటిలో కొన్ని రుద్రవీణ, సరస్వతి వీణ, చిత్ర వీణ , విచిత్ర వీణ...ఇలా ఎన్నో పేర్లతో పిలిచేవారు.

మన తెలుగు రాష్ట్రమైన బొబ్బిలి కూడా చరిత్రలో చోటు సంపాదించుకుంది. బొబ్బిలి వీణని 17వ శతాబ్దంలో విజయనగర రాజు పెద్దరాయుడు గారి ఆధ్వర్యంలో ఉపయోగించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. విజయనగర రాజులు సంగీత ప్రియులని, చాలా మంది వీణ వాయించడం నేర్చుకున్నారని , సర్వసిద్ది కమ్యూనిటీ‌కి చెందిన కళాకారులు ఈ వీణని తయారు చేసేవారని చెబుతారు.

అందువలన ఆనాటి విజయనగర రాజులు పెద్దపల్లి అనే గ్రామాన్ని వారికి కేటాయించారని. అప్పటినుండి కూడా అవి బొబ్బిలి వీణలుగా ప్రసిద్ధి చెంది తయారు చేయబడుతున్నాయని ప్రసిద్ధి. మనందరి ఆశయం ఒక్కటే. మన ప్రాచీన వారసత్వ సంపద, మన భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి చిహ్నమైన వీణను భావితరాలకు అందించి, వారి భవితవ్యాన్ని అందంగా ఆనందంగా తీర్చిదిద్దడమే మనముందున్న కర్తవ్యం.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle