newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

మంత్రి కేటీఆర్ జిల్లాలో కీచకుడు

14-02-202014-02-2020 12:31:13 IST
2020-02-14T07:01:13.409Z14-02-2020 2020-02-14T07:00:59.260Z - - 11-08-2020

మంత్రి కేటీఆర్ జిల్లాలో కీచకుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజన్న సిరిసిల్ల బాలికల హాస్టల్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాలికలను వేధిస్తున్న ఘటనలో హాస్టల్‌ వార్డెన్‌ భూదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్లో క్యాటరింగ్ కాంట్రాక్టరుగా పని చేస్తున్న దేవయ్య అనే వ్యక్తి అక్కడ పలువురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి.

దేవయ్య టీఆర్ఎస్ నేత కావడం, అతనికి వంట మనిషి సహకరిస్తుండడం వివాదాస్పదం అయింది. అంతేకాక, ‘డబ్బులిస్తా రాత్రికి వచ్చెయ్’ అని అనేవాడని, స్నేహితులను ఒప్పించి తన వద్దకు పంపాలని పదే పదే వేధించేవాడని బాలికలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దేవయ్యను, వంట మహిళను పోలీసులు అరెస్టు చేశారు.వేధింపులకు పాల్పడుతున్న దేవయ్యను కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రకటించారు.విద్యార్థి సంఘాలు ఈఘటనపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఎస్పీ రాహుల్ హెగ్డే తీవ్రంగా స్పందించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle