newssting
BITING NEWS :
తీవ్ర వివాదాల మధ్యనే పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు. ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసినా వెనక్కు తగ్గని కేంద్రం * రాజ్యసభలో కొనసాగుతున్న దుమారం. విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను హరివంశ్‌ తూట్లుపొడిచారాని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శ * అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిలనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం మరోసారి ప్రయత్నాలు. శశికళ విడుదల కోసం అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ఢిల్లీకి పయనం. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో చర్చలు * ఆరు నెలల తర్వాత సోమవారం ఉదయం సందర్శకుల కోసం తెరుచుకున్న ఆగ్రాలోని అంతర్జాతీయ చారిత్రక పర్యాటక కేంద్రం తాజ్‌మహల్‌. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బారులు తీరిన సందర్శకులు. సోమవారం 160 మంది పర్యాటకులు ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు. రెండు షిఫ్తుల్లో రెండు వేలమందికి అనుమతులు * మహారాష్ట్రలోని భీవండి నగరంలో తీవ్ర విషాదం. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పది మంది మృతి, మరో 20 మందికి గాయాలు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మర సహాయక చర్యలు * నేటి నుండి హైకోర్టులో అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి, మాజీ ఎంఎల్‌ఏ శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్‌లపై రోజువారీ విచారణ. నేడు ధర్మాసనం ముందు లిస్ట్ అయిన 93 పిటిషన్‌లు విచారణ. ఆన్‌లైన్ ద్వారా రాజధానికి సంబంధించిన కేసులను విచారించనున్న ధర్మాసనం * నేటి నుండి అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాల పునరుద్ధరణ. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా దర్శనాలు నిలిపివేయగా నేటి నుండి తిరిగి దర్శనాలు ప్రారంభం. సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో దర్శనం. పిల్లలకు, వృద్ధులకు ఆలయంలోకి నో ఎంట్రీ * భారీ వర్షాలతో పోటెత్తిన కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదులకు వరద. పలు గ్రామాలు ముంపునకు గురవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. పలు గ్రామాల్లో వరదలలో చిక్కుకున్న 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు, రక్షించిన ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు * కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఉత్తర్వులు. నేటి నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరు. సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే కొనసాగనున్న పాఠశాలలు * ఈశాన్య బంగా‌ళా‌ఖాతంలో ఆది‌వారం ఉదయం ఏర్పడిన అల్ప‌పీ‌డనం. సోమ‌వారానికి మ‌రింత బలపడి అను‌బం‌ధంగా 3.1 కి.మీ. నుంచి 7.6 కి.‌మీ. ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం.

బస్ పాస్, టికెట్ ధరల పెంపుపై జనం రియాక్షన్

03-12-201903-12-2019 17:56:56 IST
Updated On 03-12-2019 17:56:52 ISTUpdated On 03-12-20192019-12-03T12:26:56.589Z03-12-2019 2019-12-03T10:32:04.756Z - 2019-12-03T12:26:52.900Z - 03-12-2019

బస్ పాస్, టికెట్ ధరల పెంపుపై జనం రియాక్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు, సామాన్యులు మండిపడుతున్నారు. సమ్మె కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఆర్టీసీ కార్మికుల మెప్పుకోసం సీఎం కేసీయార్ ప్రయాణికుల పై భారం మోపడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీలు నిరసన తెలపడానికి సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చలేదని, ఓట్లు వేయించుకునేందుకు వారు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్కూలు బస్ పాస్ లు పెరగడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు ఓ తల్లి వాపోయింది. 

ఒకవైపు కూరగాయల ధరలు పెరిగాయి. ఇప్పుడు బస్ ఛార్జీల రేట్లు పెంచడం దారుణం అంటున్నారు జనం. కేసీయార్ బాగున్నారు, ఆర్టీసీ ఉద్యోగులు బాగున్నారు. సమ్మెకాలంలో ప్రయాణికులే ఇబ్బంది పడ్డారు. టికెట్ల ధరలు పెరగడం వల్ల మళ్ళీ భారం జనం మీదే వేశారని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉద్యోగులకు వరాల కోసం జనాన్ని బలి చేయడం ఏంటని మరికొందరు అంటున్నారు. ఐదురూపాయల కంటే తక్కువ పెంచితే బాగుండేదని మరో మహిళ న్యూస్ స్టింగ్ తో  చెప్పారు.

స్కూలు, కాలేజీ పిల్లల భారం మోపడం సరికాదన్నారు. కొంతమంది ప్రయాణికులు ఛార్జి పెంచక తప్పదంటున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కేసీయార్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మనసుతో తమకు సాయం చేస్తున్న కేసీయార్ కు పాదాభివందనం చేస్తున్నామన్నారు. జీతాల కోసం ఛార్జీలు పెంచాలేదని, డీజిల్ ధరలు పెరగడం వల్లే టికెట్ రేట్లు పెరిగాయన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle