newssting
National (Loksabha)542/542
PartyLeadWin
  NDA0348
  UPA094
  BSP+SP+RLD018
  Others082
Andhra Pradesh (Assembly)175/175
PartyLeadWin
  TDP0024
  YSRCP00150
  Janasena +0001
  Others00
Andhra Pradesh (Loksabha)22/25
PartyLeadWin
  TDP0301
  YSRCP0021
  Janasena +00
  Others00
Telangana (Loksabha)17/17
PartyLeadWin
  TRS0009
  Congress0003
  BJP0004
  Others001
Odisha (Assembly)117/147
PartyLeadWin
  BJD1895
  Congress0307
  BJP0715
  Others010
BITING NEWS :
* ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా ఆమోదించిన గవర్నర్ నరసింహన్ * ఒక్క సీటుకే పరిమితం అయిన జనసేన.. పవన్ రెండుచోట్ల ఓటమి * జగన్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన చంద్రబాబు * పులివెందులలో జగన్ ఘన విజయం.. 30న ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించిన జగన్*వెంకటగిరిలో 38,557 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి ఆనం రాంనారాయణరెడ్డి * ఏపీలో ఫలితాలపై టీడీపీ నేతల షాక్.. ఫలితాలపై తమ అంచనాలు తారుమారయ్యాయన్న నేతలు *తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి విజయం

బఫూన్‌కు బిస్కెట్లేస్తున్నారా ?

09-05-201909-05-2019 18:47:45 IST
Updated On 09-05-2019 18:50:17 ISTUpdated On 09-05-20192019-05-09T13:17:45.887Z09-05-2019 2019-05-09T13:17:39.951Z - 2019-05-09T13:20:17.451Z - 09-05-2019

బఫూన్‌కు బిస్కెట్లేస్తున్నారా ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పటికప్పుడు ఎత్తుగడలు..వ్యూహాలు మార్చుకోకపోతే యుద్ధక్షేత్రంలో ఓటమి తప్పదు. అదే యుద్ధ తంత్రం. ఆ మధ్య హడావుడిగా ఫ్లైట్లేసుకుని ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశమంతా చక్కర్లు చుట్టొచ్చిన కెసిఆర్ దాన్ని పక్కన పెట్టేసారు. ఎన్నికలయ్యాక దానిసంగతి చూస్తామని చెప్పారు. మరిప్పుడు సమయమొచ్చింది. అమిత్ షా లాంటి వాళ్ళు కెసిఆర్‌కు ఫోన్ చేసి తెరాస వైఖరి పట్ల తన అసంతృప్తిని వెళ్లకక్కారన్న మాటలు వినబడుతున్నాయి. అందుకే కెసిఆర్ మళ్ళీ కాళ్లకు బలపాలు కట్టుకున్నారు. కాకపోతే ఈసారి ఫెడరల్ ఫ్రంట్ అనే బోర్డు మాత్రం మార్చారు. ఒక కాంగ్రెసుకూ....ఇంకో బీజేపీకీ దూరంగా నిలబడడమే తన ఫ్రంట్ లక్ష్యమని చెప్పుకొచ్చిన కెసిఆర్ ఇప్పుడు మోడీకి మాత్రమే దూరంగా ఉండాలని కోరుకుంటున్నారా?.

మరి మొన్నటి ఎన్నికల్లో BUFFOON RAHUL అంటూ దెప్పిపొడిచిన కెసిఆర్ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రాహుల్ దగ్గరకెళ్తారు? దానిదేముందిలే రాజకీయాలన్న తరువాత వందనుకుంటారు .. ఆ తరువాత వాటేసుకుంటారు. మనమెవరం చెప్పడానికి ? ఈ' లవ్ అండ్ హేట్రడ్' మనకేం కొత్తకాదు. మోడీకి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని అభిప్రాయాలు బలంగా వినిపిస్తుండడంతో ఆ సమర్ధన ఏదో కాంగ్రెస్‌కీ చేసేస్తే పోతుందనుకున్నారా? పైగా తాను చక్కర్లు కొట్టొచ్చినపుడు అక్కడ తెలుసుకున్న నిజాలు కూడా కొన్నున్నాయి. ఎక్కువ రాజకీయ పార్టీలు మోడీ కంటే కాంగ్రెస్‌తో దోస్తానీకే మొగ్గు చూపుతున్నాయన్న నిజమది ! సోమవారం తరువాత ఈ నిజానికి బాగా కళ్ళొచ్చినట్లు కనిపిస్తుంది. 

డీఎంకే స్టాలిన్‌తో అసలు కెసిఆర్ ఆశించిన భేటీనే కుదరలేదు. జరగకపోవడానికి కారణం డీఎంకే కాంగ్రెసు వైపు ఎప్పుడూ మొగ్గు చూపే పార్టీ. కాంగ్రెస్ మంత్రివర్గంలో భాగస్వామ్య పార్టీ. ఇక కర్ణాటక జేడీఎస్ సంగతి బాగా తెలిసిందే. అక్కడ కుమారస్వామి ప్రభుత్వం బ్రతికున్నదే కాంగ్రెసు దయాదాక్షిణ్యాల మీద. మరి మోడీ వైపు ఎందుకు చూస్తాడు? ఆ పని అక్కడ చేయడానికి యద్యూరప్ప ఉండనే ఉన్నాడు. ఇక కేరళ ముఖ్యమంత్రిది సిపిఎం . ఆ పార్టీ బీజేపీ వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశం లేదు. ఇక ఉత్తరాది పరిస్థితులు పూర్తిగా వేరు. మోడీ పట్ల వ్యతిరేకత ఉన్న విషయం తెలిసే బీజేపీ దక్షిణాదినో లేక ఈశాన్యంలోనో బలం పుంజుకోవాలన్న ఎత్తులేసింది అందుకే !అందులో భాగంగానే తమిళనాట ఏఐడీఎంకే‌ను దువ్వింది. 

కర్ణాటకలో కావాల్సినంత రచ్చ చేసి భంగపడింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బాబు దూరమైనా తరువాత కెసిఆర్-జగన్ లిద్దరికీ క్రీమ్ బిస్కెట్లు వెయ్యాలని చూసిందీ అందుకే ! అయ్యితే రేపటి రోజున కెసిఆర్-జగన్ లిద్దరూ కేంద్రంలో ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళవైపే మొగ్గు చూపుతారనడంలో సందేహమే లేదు.  ఆ విషయంలో జగన్ తన స్టాండ్‌ను ఇప్పుడో విస్పష్టంగా ప్రకటించాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళకే తన మద్దతని చెప్పాడు. బీజేపీ మాత్రం ఆ విషయంలో పెదవి విప్పలేదు. కాంగ్రెస్ సమావేశం పెట్టుకుని మరీ ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటించింది. 

ఇక రేపటి రోజున కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న కూటమికి లేదా అదే కాంగ్రెస్ బయటనుంచి మద్దతిచ్చే కూటమి ప్రభుత్వానికీ జగన్ బాహాటంగా మద్దతు ప్రకటించగలడా..పైగా తన రాజకీయ శత్రువైన బాబు ఉన్న కాంగ్రెసు కూటమిలో జగన్ పాత్రధారుడు కాకపోవొచ్చు. అంతేకాకుండా తనను కాదని ..పొమ్మనలేక పొగబెట్టిన ఆ కాంగ్రెసుతో మళ్ళీ కలిసి కాపురం చెయ్యాల్సిన అగత్యానికి జగన్ ఒడిగడతాడా ? "ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ " అన్నట్లు జగన్ కూడా యుద్ధనీతిని అనుసరించి రెండడుగులు వెనక్కి వేస్తాడా ?

ఇకపోతే చంద్రబాబు. నిన్నటి దాకా...ఇప్పుడు కూడా మోడీతో కెసిఆర్-జగన్ లిద్దరూ నా మీద కుట్రపన్నుతున్నారంటూ పదేపదే ఆరోపణలు చేసి అలిసిపోయిన బాబు ఈ కెసిఆర్ కొత్త ఆలోచనలను ఏ విధంగా అర్ధం చేసుకుంటారు? అంటే ఇన్నాళ్ళూ తాను కెసిఆర్ జగన్ లిద్దరి మీద చేసిన ఆరోపణలు తప్పని మనమర్ధం చేసుకోవాలా లేక తనలాగే అవసరార్ధం ఎవరు ఎవరితో కలిసినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని వదిలేయడమా? రేపటి ఫలితాల్లో బాబుకు కనుక కావాల్సినన్ని ఎంపీ సీట్లు రాని పక్షంలో అక్కడ సీట్లొచ్చేవాళ్లే కీలకమౌతారు. కింగ్ మేకర్లవుతారు. అప్పుడు రాహుల్ గాంధీని 'బఫూన్' అంటూ ఎద్దేవా చేసిన కెసిఆర్ రేపటిరోజున కావలింతల పర్వానికి తెర లేపొచ్చు.. ఆశ్చర్యపడక్కర్లేదు.

మోడీకి రేపటిరోజున ఆశించిన సీట్లు రావన్న ఆలోచనలు బలపడుతున్నాయి. పార్టీ వాళ్ళే ఆ మాటలంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్- మోదీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి పార్టీలను పోగెయ్యడం చాలా కష్టం. కాంగ్రెసుకు అసలు అడ్వాంటేజ్ లేకపోయినప్పటికీ ఎక్కువ పార్టీలు ముఖ్యంగా... ప్రాంతీయ పార్టీలు బీజేపీ వైపు మొగ్గు చూపడం లేదు. వారంతా కాంగ్రెసు వైపు మొగ్గు చూపడమో లేక కాంగ్రెసు మద్దతుతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికే అవకాశాలు ఎక్కువుంటాయి. అందుకే కెసిఆర్ తన వ్యూహం మార్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

కేంద్రానికి రాష్ట్రాలు ఎన్నాళ్లీ గులాం గిరీ చేయాలంటూ కేంద్రంపై ధిక్కారస్వరాన్ని వినిపించిన కెసిఆర్ కేంద్రంలో తనదైన మార్క్ రాజకీయం చేయాలనుకున్నది నిజం. హనీమూన్ డేస్‌లో మోడీతో జతకట్టి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చుకునే క్రమంలో బాబు పాల్పడ్డ కొన్ని అసంబద్ధమైన చర్యలే కెసిఆర్ ఆగ్రహానికి కారణమంటారు. అప్పటి నుంచే వీళ్లిద్దరి మధ్యన ఉన్న వైరాన్ని మోదీ చాలా తెలివిగా ఉపయోగించుకోవడం మొదలైంది.

మోడీకి కావల్సినంత మెజారిటీ రాదన్న మాటే నిజమైతే మరీ పార్టీలన్నీ ఏం చేస్తాయి? ఇప్పటికే బాబు ఢిల్లీకి తన మకాం షిఫ్ట్ చేసి మొత్తం ఫోకస్ అంతా మహాకూటమి మీదే కేంద్రీకరించడం.. ఫలితాలకు ముందే ఇరవై ఒక్క పార్టీల కార్యాచరణ ఇప్పుడే చేసేయాలని పార్టీల మీద ఒత్తిడి పెంచడం దేన్ని సూచిస్తోంది? చంద్రబాబు చేస్తున్న ఇంత హడావిడి మోడీని నిలువరించడానికేగా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? మోడీ వస్తే ఇక్కడిద్దరు చక్రం తిప్పుతారు. ఒకరు కెసిఆర్ అయితే రెండవది జగన్ మోహన్ రెడ్డి. కెసిఆర్ సంగతి పక్కన పెడితే తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి జగన్ కీలక పాత్ర పోషిస్తే అది తనకు... తన పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది. ఇన్ని ఆటుపోట్లను తట్టుకునే శక్తీ ఈ వయసులో బాబుకు ఉందా? పోనీ వీళ్ళిద్దర్నీ కాంగ్రెసు వైపు రాకుండా బాబు ఆపగలరా...అడ్ఢేయగలరా అంటే అదీ అసంభవమే. ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళవి.

మొత్తమ్మీద ఒకళ్ళ పెళ్లి ఇంకొకళ్ళు చావు కొచ్చిన మోటు సామెత గుర్తుకొస్తోంది. రేపు రిజల్ట్స్ తెచ్చేతంటాలన్నీఇన్నీకావు. ముందుగానే లెక్కలేసుకుంటున్న కెసిఆర్ రాహుల్ గాంధీకి బిస్కెట్లేసే పనిలో పడ్డారా ... అని అంటున్నాయి కొన్ని మీడియా సంస్థలు.. వాటి రాజకీయ విశ్లేషణలు.

అందుకే అన్నది...

BUFFOONకు బిస్కెట్లేస్తున్నారా?


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle