newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

పట్టుదలతో విజయం అంగవైకల్యాన్ని జయించిన జానీమియా

05-08-201905-08-2019 12:15:23 IST
Updated On 05-08-2019 12:24:51 ISTUpdated On 05-08-20192019-08-05T06:45:23.145Z05-08-2019 2019-08-05T06:44:58.383Z - 2019-08-05T06:54:51.189Z - 05-08-2019

పట్టుదలతో విజయం అంగవైకల్యాన్ని జయించిన జానీమియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ నే ఈ జానీ మియా . ఖమ్మం జిల్లా కామంచి కల గ్రామానికి చెందిన జానీమియా కు పుట్టుకతోనే పోలియో వచ్చింది ,చదువు ఐ టి ఐ పూర్తి చేసాడు . బిన్నంగా ఆలోచించి కొత్త పరికరాలు తయారు చేయడం తన ప్రత్యేకత ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైనా పనిచేయవని పక్కన పడేస్తే అవి ఎందుకు పనిచేయవు అంటూ ప్రయోగాలు చేసి  వాటిని ఉపయోగంలోకి తెచ్చేవాడు ,ఇలా కొత్తవాటిని ఆవిష్కరిచండం జానీమియా ప్రత్యేకత.

ఒక సమయంలో  తనకి కారు నడపాలన్న కోరికా  కలిగింది కానీ తన అంగవైకల్యం తనని బాధించింది ఎలాగైనా కారు నడపాలన్న ఆశ క్రమంగా కారు ఇంజన్ పని చేసే విధానాన్ని తెలుసుకునేలా చేసింది .క్లచ్ ,బ్రేక్, ఎక్స్లాటర్ ఎలా పని చేస్తాయో తెలుసుకొని  వాటిని చేతులతో అనుసంధానం చేసి విజయం సాధించాడు జానీమియా .క్లచ్ ,బ్రేక్, ఎక్స్లెటర్ చేతులతో అనుసంధానం చేసి అంగవైకల్యం ఉన్నవారికి కార్లని మోడీఫీ  చేసి ఇస్తున్నాడు ఇందుకు హైడ్రాలిక్ ,ఎలక్ట్రికల్ మోటార్స్ ,కేబుల్స్ ని ఉపయోగిసున్నడు. 

అంగవైకల్యం ప్రకారం  14 రకాలుగా కార్లను మోడీఫీ చేస్తాడు జానీమియా 2009 లో ఖమ్మ నుండి హైదరాబాద్ వచ్చిన జానీమియా ఇప్పటివరకు 1100 కార్లను వికలాంగులకు అనుకూలంగా మోడీఫీ చేసిఇచ్చాడు .ఇంకో విశేషం ఏంటటే  ఏ కార్లను మాములు వ్యక్తులు నడిపేటప్పుడు వికలాంగుల కోసం అమర్చిన  వ్యవస్తను లాక్ చేయవచ్చు 

వికలాంగులు ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు వారి వైకల్యాన్ని గమనించి తానే దగ్గరుండి డెమో కార్లలో డ్రైవింగ్ నేర్పిస్తాడు ఇలా 2,3 వారాల్లో వారు డ్రైవింగ్ నేర్చుకుంటారు ,ఇలా నేర్చుకొని సాధారణ వ్యక్తులతో సమానంగా కారు నడపగలుగుతున్నమని చెప్తున్నారు జానీమియా కస్టమర్స్  అంతేకాదు పూర్తిగా  నడలేనివారికి డ్రైవింగ్ సీట్ బయటకు వచ్చేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాడు తనను ఆశ్రయించిన వికలాంగుల వాహనాలను  వారికి  అనుగుణంగా మోడీఫీ చేసి ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు జానీమియా.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle