newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

నిలువుదోపిడీకి కేరాఫ్ ఓఎల్ఎక్స్

10-09-201910-09-2019 07:46:52 IST
Updated On 12-09-2019 12:27:46 ISTUpdated On 12-09-20192019-09-10T02:16:52.647Z09-09-2019 2019-09-09T12:34:59.524Z - 2019-09-12T06:57:46.857Z - 12-09-2019

నిలువుదోపిడీకి కేరాఫ్ ఓఎల్ఎక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనాన్ని మోసగించేందుకు కేటుగాళ్ళు మాటువేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్నీ వారు వదులుకోవడం లేదు. తాజాగా ఓఎల్ఎక్స్ పేరుతో మోసగాళ్ళు నిలువునా ముంచేస్తున్నారు.అక్షరాలు రానివారు మాత్రమే కాదు, ఉన్నత చదువులు అభ్యసించినవారు సైతం మోసగాళ్ళ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఏటీఎం కార్డులు, క్రెడిట్‌ కార్డుల పేరు చెప్పి అకౌంట్లలో డబ్బులు కాజేసేవారు. ఇప్పుడు ఓఎల్‌ఎక్స్‌లో పాగా వేసి అందినకాడికి దోచుకుపోతున్నారు. తక్కువ ధరకు కార్లు, సెల్‌ఫోన్‌లు ఇతర వస్తువులను ఓఎల్‌ఎక్స్‌లో పెడుతున్నారు.. దీంతో వాటికి ఆశపడి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే అమాయక ప్రజలకు మోసగాళ్ళు కుచ్చుటోపీ పెడుతున్నారు.

 

సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఓఎల్ఎక్స్ బాధితులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ కేసుల గురించి తెలుసుకుంటే వాటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 2018లో ఎఫ్ఐఆర్ దాఖలుచేసినవి 11 కాగా మొత్తం ఫిర్యాదులు 190. ఈ మోసాల విలువ 60లక్షల రూపాయల పైమాటే. 2019లో ఎఫ్ఐఆర్ దాఖలుచేసినవి 8 కాగా , ఫిర్యాదులు 841, మొత్తం మోసాల విలువ 2 కోట్ల 85 లక్షల పైమాటే.

 

దీనిని బట్టి చూస్తే ఓఎల్ఎక్స్ పేరుతో ఎన్నికోట్ల మోసాలు జరుగుతున్నాయో తెలిస్తే కళ్ళుతిరగడం ఖాయం. ఓఎల్ ఎక్స్ పేరుతో మోసానికి గురవుతున్న బాధితులను ‘న్యూస్ స్టింగ్’ పలకరించింది. సెల్ ఫోన్లు, బైక్‌లు టీవీల పేరుతో యూపీఐ పేమెంట్స్ ద్వారా 20వేల రూపాయల నుంచి లక్షల్లో తమను మోసం చేశారని బాధితులు తెలిపారు.

 

సో, ఓఎల్ఎక్స్ పేరుతో వచ్చే యాడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్లలో మీ అకౌంట్ విషయాలు, ఓటీపీ నెంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. మీ జాగ్రత్తే మీకు శ్రీరామరక్ష.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle