facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

నిప్పులు కక్కుతూ నింగికి... ఎన్టీఆర్ ఫ్యాక్ట్ షీట్

18-01-201918-01-2019 16:10:53 IST
2019-01-18T10:40:53.251Z18-01-2019 2019-01-18T10:40:49.163Z - - 17-02-2019

నిప్పులు కక్కుతూ నింగికి... ఎన్టీఆర్ ఫ్యాక్ట్ షీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎన్టీఆర్... మనల్ని విడిచి వెళ్లి 22 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇవ్వాళాయన 23వ వర్ధంతి. ఎన్టీఆర్ అనే పుస్తకంలో వున్న అసలుసిసలైన అధ్యాయాన్ని అధ్యయనం చేసిన వాళ్ళెంతమంది? ఆ పుస్తకంలోని పుటల్ని లోతుగా చదివిన వాళ్ళెంతమంది? చరిత్రను తిరగరాసుకున్న అతికొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు ఎన్టీఆర్. రాజకీయాల్లో ఆయనే  ఆదర్శమంటూ జెండాలు ఒంటికి చుట్టుకుంటారు... పటాలు కట్టించి పూజిస్తారు... కానీ ఆ పూజల్లోని చిత్తసుద్దులెంత? చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే దుర్బుద్ధులే తప్ప!  సామాన్యుడికి సైతం రాజకీయాల్ని పరిచయం చేసిన ఎన్టీఆర్... అదే సామాన్యుడి ఓటుకున్న విలువను రెట్టింపు చేశారు. తెలుగుదేశానికి అంకురార్పణ చేసి రాష్ట్ర రాజకీయ చరిత్రను మలుపుతిప్పి, ఢిల్లీ నడివీధుల్లో సైతం తెలుగోడి సత్తాను చాటి... ఆ లోక్‌సభలోనే ప్రధాన ప్రతిపక్షపు హోదాను కట్టబెట్టిన నిలువెత్తు మనిషి ఎన్టీఆర్! ఇవాళ రాజకీయం పేరుతో నిస్సిగ్గుగా జరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులు, అవకాశవాదాలు చూసినప్పుడల్లా ఆయన మనసు విప్పి పరిచేసిన ధర్మపీఠం మాటలు గుర్తుకొస్తాయి. ఎన్నికైన వాళ్ళను తిరిగి వెనక్కి రప్పించే హక్కు.. రైట్ టు రీకాల్ మనకుండాలన్న ఆ ఎన్టీఆర్ ఇవ్వాళ మళ్లీమళ్లీ గుర్తుకొస్తున్నారు.

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle