newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

నర్సరీ మేళా.. చూస్తే ఈమొక్కలు కొనకుండా ఉండలేరు!

19-08-201919-08-2019 19:35:26 IST
Updated On 28-08-2019 17:04:50 ISTUpdated On 28-08-20192019-08-19T14:05:26.525Z19-08-2019 2019-08-19T13:36:41.887Z - 2019-08-28T11:34:50.752Z - 28-08-2019

నర్సరీ మేళా.. చూస్తే ఈమొక్కలు కొనకుండా ఉండలేరు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుతం జనం రోగాలతో కుస్తీ పడుతూ ఆరోగ్యం కోసం తపిస్తున్నారు. అందులో భాగంగా ఆర్గానిక్ ఫుడ్స్, ఔషథ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. జాతీయ ఉద్యాన, వ్యవసాయ, నర్సరీ ప్రదర్శనకు భాగ్యనగరం మరోసారి వేదిక అయింది. ఉద్యావనశాఖ, తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి 20 వరకు ఈ 7వ గ్రాండ్‌ నర్సరీ మేళా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతోంది. ఈ మేళా అరుదైన వృక్షాలు, తృణధాన్యాలకు వేదికైంది. వేలాదిమంది సందర్శకులు ఈ నర్సరీ మేళాను సందర్శించి.. ఆరోగ్యకరమయిన ఆహారం, మొక్కల గురించి ఆరాతీయడం ‘న్యూస్ స్టింగ్’ కంట పడింది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పేరున్న కంపెనీలు, నర్సరీలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు ఆధ్వర్యంలో 100కుపైగా స్టాళ్లు ఇక్కడ కొలువు తీరాయి. నగరసేద్యానికి ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఇంటి ఆవరణ, డాబా, బాల్కనీ, బహుళ అంతస్తుల భవనాలపై ఆకుకూరలు, పండ్లు, పూలమొక్కలు పెంచుకోవడానికి అనువైన విత్తనాలు, నారు, సేంద్రీయ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. హైడ్రోఫోనిక్, టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, పలు రకాల మొక్కలు, ఎగ్జాటిక్, బోన్సాయ్, కాక్టస్, సక్కులెంట్, అడేనియం, ఇండోర్, అవుట్‌డోర్, హైక్వాలిటీ ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఔషధమొక్కలు, ఆక్సిజన్‌శుద్ధి మొక్కల ప్రదర్శన, విక్రయాలు కొనసాగుతున్నాయి.

Video Journalist: Mamidi Venkateswarlu


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle