newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

ట్రాఫిక్ రూల్స్ తో ప్రమాదాలకు చెక్

13-11-201913-11-2019 15:09:12 IST
Updated On 13-11-2019 15:09:10 ISTUpdated On 13-11-20192019-11-13T09:39:12.388Z13-11-2019 2019-11-13T09:26:18.238Z - 2019-11-13T09:39:10.803Z - 13-11-2019

ట్రాఫిక్ రూల్స్ తో ప్రమాదాలకు చెక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోటిమంది జనాభాకు చేరువైన గ్లోబల్ సిటీ హైదరాబాద్ లో పౌరులు, వాహన యజమానులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీపీ అంజనీకుమార్ కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్-మెక్ డొనాల్డ్స్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనదారులు, ఆటో యజమానులతో ప్రతిన చేయించారు.

ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటిస్తామని, ఆటోల్లో తక్కువమందిని తీసుకువెళతామని వారిచేత ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా మెక్ డొనాల్డ్స్ ఆపరేషన్స్ హెడ్ రితేష్ కుమార్ కార్యక్రమం గురించి వివరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించినవారికి తమ సంస్థ తరఫున బహుమతులు అందిస్తామన్నారు. పౌరులంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటించినవారికి ఈసందర్భంగా సీపీ బహుమతులు అందించారు. ట్రాఫిక్ అవగాహనకు సంబంధించి బెలూన్లు, ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle