newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఎండ్ ది విన్నర్ ఈజ్… ఒక్క ఛాన్స్ !

10-04-201910-04-2019 22:00:22 IST
Updated On 10-04-2019 22:13:05 ISTUpdated On 10-04-20192019-04-10T16:30:22.059Z10-04-2019 2019-04-10T12:28:46.636Z - 2019-04-10T16:43:05.157Z - 10-04-2019

ఎండ్ ది విన్నర్ ఈజ్… ఒక్క ఛాన్స్ !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క ఛాన్స్‌కే ఓటా? తెరలు..ముసుగులు తీసేసి..ఉన్నదున్నట్టుగా ఒకట్రెండు 'పేద్ద' నిజం చెప్పుకోవడానికి ముందుకొస్తే... ఆ  'ఒక్క ఛాన్స్' కే  ఓట్ అంటూ ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిందే... . కానీ అది జరగదు ఎందుకంటే అక్కడ  ముసుగులు తీయలేదు కాబట్టి ! ఆ ముసుగులు తీయాలన్న కనీసపు ఆలోచనలు వాళ్లకు లేవు కాబట్టి ! అందుకే అక్కడ మనకు మసకబారిన దృశ్యాలే కనిపిస్తాయి. ఒక్క ఛాన్స్ కే ఓటేయాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. ఫ్యాన్ గాలి బలంగా వీస్తోందో లేదో తెలియదు కానీ.. ఆ గుర్తు మీట మీద నొక్కే వేళ్ళ లెక్క ఎక్కువని చెప్పక తప్పదు. ఇదీ ఓటర్ల నాడి పట్టి చూసిన పోల్ డాక్టర్ల నిర్ధారణ !  సరే.. ఇక్కడేంటి ... బాబుగారు కొత్తగా వంగివంగి సలాములు చేస్తున్నారు...ఈ స్టయిల్లో ఆయన్నిచూస్తున్న కొద్దీ సైకిల్ టైరులో గాలి లేదన్న నమ్మకాలు పెరుగుతున్నాయి. అంతే కాదు ఆ ఫ్యాను బాగానే  తిరుగుతోందన్ననమ్మకాలు కూడా  బలపడిపోతున్నాయి. ఈ బాబు సరికొత్త 'వంగడాలకు' ఓట్లు పడతాయన్న నమ్మకాలైతే కలగడంలేదు. ఏపీలో ఓట్ల త్రాసు మాత్రం ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వడానికే ఫ్యాన్ వైపు వొరిగిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. 

అసలు సర్వేరాయుళ్ల తీర్పులన్నీ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి వైపుకు వేళ్ళు చూపిస్తుంటే.... పోయినసారి కూడా వీళ్లదేపని చేశారన్న జ్ఞాపకాలు పొడిచేస్తుంటాయి. పోనీలే ఎక్కడో తప్పటడుగులు పడుంటాయి అంటూ సర్దుకుపోయిన వైనం గుర్తొస్తోంది. . ఈసారి.. క్షేత్రస్థాయి తప్పిదాలు.. మేనేజ్మెంట్లూ లేకపోతే గెలుపెవరిదన్న విషయంలో పక్కా క్లారిటీ.. ది విన్నర్ ఈజ్ వైస్సార్సీపీ. సర్వేలు చేసే వాళ్ళ ముందు జనం ఏం చెప్పినా.. టీవీ గొట్టాల ముందు జనం ఎవరికీ ఓటేస్తారో ఏం చెప్పినా...చెప్పకపోయినా వాటిని ప్రాతిపదికగా తీసుకోకూడదన్న ప్రాథమిక నిర్ణయానికి జేడీ ఎప్పుడో వచ్చింది. వాళ్ళకో విషయం అర్ధమయింది.

టీవీ స్క్రీన్ల మీదా.. చేతి ఫోన్ స్క్రీన్ల  మీదా తమ పార్టీలని తిట్టే మనుషులమీద పగలు పెంచుకుంటున్న ఆయా నాయకులు వాళ్ళను గుర్తుపట్టి గల్లాలు పట్టుకుంటారన్న భయం వాళ్ళది.. అందుకే కెమెరాల ముందు తెలివిగా సమాధానాలిచ్చుకుంటున్నారు ఇది ఈ ఐదేళ్లలో జనం బాగా నేర్చేసుకున్న విద్య !  మనకే అర్ధంకాలేదు. డబ్బిచ్చినోడికే ఓటెయ్యాలనే అదో రకం విధేయతలు జనాలకున్న మాట నిజమే. ఆయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంప్రదాయ సూత్రానికున్న ప్రామాణికతలు అనుమానమే.

నోటుకే ఓటు అన్న కాలానికీ చీటీ చెల్లిపోయిందనిపిస్తుంది. పైగా బహిరంగంగానే అన్ని  పార్టీ  నాయకులు..‘‘ఎవడు డబ్బిచ్చినా తీసుకోండి..ఓటు మాత్రం మా పార్టీకేవెయ్యండి" అంటూ మైకుల్లోనే అరిచి మొత్తుకుంటున్నారు. ఇక సగటు ఓటర్లు ఈ నాయకుల మాటల్ని వంటబట్టించుకోలేదంటే నమ్మాలా? అందుకే  పసుపుకుంకుమల పేరుతో సెంటిమెంటు మీద దెబ్బేద్దామనుకున్న  బాబుకు ఆ కోటి మహిళలూ తమ  మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఓటేస్తుందంటే నమ్మబుద్దికాదనిపించేది అందుకే ! 

కింగులా కనిపిస్తున్నాడు..మరి వొంగి వొంగి దండాలెందుకు పెడుతున్నాడు .. అంటూ  క్షణక్షణం సినిమాలో శ్రీదేవి హీరోని అమాయకంగా ప్రశ్నిస్తుంది.  నిజమే ఆ గమ్మత్తు సరదాగానే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబనే కింగ్ ... మీడియా ముందుకొచ్చి వంగడం.. సరికొత్త స్టైల్. పోనీ ఎవరో  విదేశీ ప్రముఖుడు వచ్చినపుడు ఆయన మర్యాదపూర్వకంగా వంగి సలాం చేశారంటే అదో మాట..కానీ ఎప్పుడూ లేనిది ఏకంగా మీడియా ముందుకొచ్చి ఈ వంగడాలే ఆశ్చర్యం. అయినా బాబుకు సరిగ్గా ఈ పోలింగ్ తేదీకి ముందే ఇంతటి దీనత్వం ఎందుకో.. !  ఆయన తన ఓటమి వాసనల్ని పసిగట్టేశారా? తనకు భట్రాజు భజన చేసే ఒకట్రెండు మీడియా సంస్థల్ని ... ఇద్దరు  ముగ్గురు చిడతల అప్పారావుల్నీ ఆయన ఎప్పుడో పక్కన పెట్టాల్సింది.. కానీ ఇంకా..ఇప్పుడుకూడా...తన భుజాల మీదేసుకుని స్వారీ చేయిస్తున్న  వైనమే దయనీయం. సైకిల్ టైర్లో గాలి దిగిపోయిందనిపించడానికి ఇదీ కారణం.

చివరిగా ఒక్క విషయం. 2014లో 1.8 శాతం ఓట్ల తేడాతో నలభై సీట్లు కొల్లగొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ .. ఈసారి కూడా అంతే అయి ఉండొచ్చనే దింపుడు కళ్లాల ఆశ కొంతమందిది! వంద నుంచి అయిదువేల  ఓట్ల తేడాతో వోడి గెల్చిన నేపధ్యాలు రెండు పార్టీలవీ ! అయితే ఈసారి అదంత సులువు కాదన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. చివరి నిమిషంలో ప్రలోభాలతో లొంగదీసుకునే అవకాశాలు లేవనే చెప్పాలి. గత రెండ్రోజుల్లో ...దాదాపు రెండు మూడు చోట్ల దొరకబుచ్చుకున్న 400 కోట్ల  నోట్ల కట్టల వార్తల్ని చూసింతరువాత ఎల్లో కరెన్సీకి చక్రబంధనం చేశారన్నది విశ్వసనీయ సమాచారం. ఇంకొక్కసారి అంటున్న తెలుగుదేశాధినేతకు ఛాన్స్ కష్టం.  ఒక్క ఛాన్స్  ఇవ్వండంటున్న జగన్ కే వోటుపడే అవకాశాలున్నాయన్నది ఇవాళ  ఏపీ తెర మీద కనిపిస్తున్న దృశ్యం. ఇక్కడ జర్నలిస్ట్ డైరీ జోస్యం చెప్పడం లేదు. అటువంటి పనెప్పుడూ చేయలేదు.. చేయదు కూడా! ఇప్పటిదాకా క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న  పరిణామాల ఆధారంగా చేసిన ఒక  విశ్లేషణ మాత్రమే !  

AND... THE WINNER IS...  ' ఒక్క ఛాన్స్'

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle