newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

ఇవిగో... ఇవీ మన రైతు బిడ్డల కష్టాలు

07-03-201907-03-2019 15:42:30 IST
2019-03-07T10:12:30.864Z07-03-2019 2019-03-07T10:12:28.762Z - - 22-09-2019

ఇవిగో... ఇవీ మన రైతు బిడ్డల కష్టాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నదాతల ఇక్కట్లు తప్పడం లేదు. కరువు ప్రాంతాల్లో రైతులు సాధారణంగా శనగపంటను సాగుచేస్తారు. నీటి వినియోగం తక్కువగా ఉండడం వల్ల ఈ పంట త్వరగా చేతికి అందుతుంది. అయితే మధ్య దళారులు, వ్యాపారులు, అధికారుల తీరుతో ఇక్కట్లు పడుతున్నారు శనగ రైతులు. పంట ఏదైనా రైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావు! శనగ, కంది, మినుము, మిర్చి, పత్తి.. ఇలా ఏ పంట పండించినా అన్నదాతకు మిగిలేది కడగండ్లే! మార్కెట్‌ కమిటీల్లో అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల మాయాజాలం, దళారుల దోపిడీతో రైతులు కుదేలవుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కొండపర్లి వెళ్ళేదారిలో శనగపంట కోస్తున్న మహిళా కూలీలు, రైతులను ‘న్యూస్ స్టింగ్’ పలకరించింది.

తాము పంట వేసినప్పటినుంచి తిరిగి అది చేతికి వచ్చే వరకూ నిత్యం ఆందోళన పడుతుంటామని, గత నాలుగేళ్లుగా తమను కరువు పలకరిస్తోందని, ప్రభుత్వ సాయం అంతంతమాత్రమే అంటున్నారు శనగ రైతులు. ఇటు కూలీలు సైతం శనగపంట కోయడానికి తెల్లవారు జామునుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తాము కష్టపడతామని, దక్కే కూలి 150 రూపాయలు మాత్రమే అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు ఇలాగే ఉంటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle