newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఇక్కడ లాగులు తడిచిపోతున్నాయి

09-07-201909-07-2019 16:14:27 IST
Updated On 09-07-2019 16:14:25 ISTUpdated On 09-07-20192019-07-09T10:44:27.048Z09-07-2019 2019-07-09T10:43:24.712Z - 2019-07-09T10:44:25.377Z - 09-07-2019

 ఇక్కడ లాగులు తడిచిపోతున్నాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణాదిపైన బీజేపీ కన్నేసిన మాట నిజం. అవే దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయం జెండాను రెపరెపలాడించాలనేది కమలనాధుల చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేసుకోవడానికి మోడీ-షాలు కట్టి తిప్పుతున్నారు.

నయానో భయానో రాజకీయ నాయకుల మెడల్ని వంచి బీజేపీ కండువా వేస్తున్నారు. అసలీ ఎపిసోడ్ వెలుగు చూసే సమయానికి కర్నాటకంలో చివరి అంకం పూర్తయ్యేలా కనిపిస్తోంది. అక్కడ బీజేపీ జెండా మళ్ళీ ఎగరేస్తే ఇక పార్ట్ టూ మొదలైనట్లే. మొత్తానికి మోడీ 2.0 చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం నుంచి వలస పోవడానికి పెట్టేబేడా సర్దేసుకున్న వాళ్ళు సర్దేసుకుపోగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చాపలు చుట్టేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. 

తెలుగుదేశం పని మొదలైపోయి ఒక కొలిక్కి వచ్చింది కాబట్టే నెక్స్ట్ టార్గెట్ గా తెరాస మీద ఫోకస్ చేస్తున్న మాటైతే నిజం. కెసిఆర్ సన్నిహితులైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల మీద జరుగుతున్న ఆర్ధికపమైన దాడులు  ఈ ఫోకస్ లో భాగమేనా ? ఏదైతేనేం … ఒక రామేశ్వర రావు ..ఇంకో మల్లారెడ్డిల ఉదాహరణలు తెరాస రాజకీయ మద్దతుదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

ఆ విషయం చర్చ జరుగుతుండగానే ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చిన అమిత్ షా తో కొంతమంది స్థానిక బీజేపీ నాయకులు తెరాస ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి ఫిర్యాదు చేస్తే… ఆయన “గట్టిగా పోరాడండి.. అవసరమైతే మీకు ఢిల్లీ నుంచి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది’అని నేరుగా చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.? ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి నోట్లోనుంచి ఇటువంటి మాటలే రాల్తాయని భావించినా నిఘా సంస్థల్ని ఉసికొల్పుతున్నారన్న భయమే ఇవ్వాళ దేశంలోని బీజేపీయేతర ప్రతిపక్షాలన్నింటికీ పట్టుకున్నది.

నిజానికి దర్యాప్తులు, నిఘాలు వేరు..కోర్టు కేసులు అంతకంటే  వేరు. ఇక ఇదే విషయాన్ని బీజేపీ నాయకుల దగ్గర ప్రస్తావిస్తే "అదంతా రొటీన్ గా జరుగుతున్న వ్యవహారమే... అందులో మా పార్టీ రాజకీయ ప్రమేయం అస్సలేదు’’ అంటూ అడ్డంగా తలలూపే సగటు రాజకీయమే అక్కడా కనిపిస్తుంది. నిఘా సంస్థల స్వతంత్రతల్నీ.. స్వయంప్రతిపత్తుల్నీ కేంద్ర ప్రభుత్వం గొలుసులతో బంధించిందన్న గత నాలుగైదేళ్లుగావినిపిస్తూనే ఉంది. రాజకీయంగా అధికార పార్టీ బలపడడానికి ప్రభుత్వ నిఘా సంస్థల్ని విచ్చల విడిగా వాడుకోవడం కాంగ్రెస్ జమానాలోనే మొదలైందన్న మాట కూడా నిజమే కదా !

ఇప్పుడు పులి మీద పుట్రలా ఇంకో సవాల్. అయిదేళ్ల పదవీ కాలాన్ని కట్ చేసి ... ఈసారి నాలుగేళ్ల మురిపెంగా మార్చేసారూ మోడీ. ఈ జమిలి ఎన్నికల మీద కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.

ఆయన జమిలి ఎన్నికలన్న నిర్ణయం తీసేసుకుని "అన్ని ఎలెక్షన్స్ ఈసారి 2023 లోనే.." అంటూ కత్తి తిప్పుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రుల నోట మాట కూడా రావడంలేదు. ఆ మధ్య కెసియార్ ఢిల్లీ వెళ్లి "మోడీ కంబైన్డ్ ఎలక్షన్ల ప్రతిపాదన’’కు జిందాబాద్ కొట్టొచ్చిన విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు కెసిఆర్-మోడీల మధ్య స్నేహాలు చెడి తలరాతలు మారిపోయే పరిస్థితి పరిణమిస్తుందంటున్నారు. నిజానికి ఈ కంబైన్డ్ ఎలెక్షన్స్ చివరకు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల కొంపలు ముంచేలా ఉన్నాయి.

అంటే జగన్ పార్టీ కూడా ఇబ్బంది పడబోతోందా? అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రాలో సైతం తన ప్రతిష్టను పెంచుకోవాలని ఆ బీజేపీ నేతలే స్వయంగా చెప్తున్నారు.

అత్యధిక మెజారిటీతో రికార్డుల్ని బద్దలు గొట్టి అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీని ఎలా కూలుస్తారన్నది ఆ పార్టీ వర్గాల ధీమా ! అయితే సామదానబేధదండోపాయాలు,  టక్కుటమారా విద్యలు మన రాజకీయాలకు కొత్తేమీ కాదు. మాటు వేసి సమయం చూసి వేటు వేసే యుద్ధ తంత్రాలకు మన దగ్గర కొదవేముంది? ఇంతకు మించిన వివరణలు, విపులీకరణలూ ఇక్కడ అనవసరం. 

జగన్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే క్రమంలో ఉన్నాడు. ముఖ్యమంత్రిగా కుదుటపడుతున్న నేపధ్యం. అయితే అతనిపైనున్న కేసులే అతన్ని మోడీ అంటే భయపడేలా చేస్తున్నాయన్న విమర్శ ఉండనే ఉంది.

ఆ విషయాన్ని మోడీ తన అస్త్రంగా వాడుకుంటారన్న దాంట్లో కూడా సందేహమే లేదు. చట్టాలు తమ పని తాము చేసుకునిపోయే దేశం కాదిది. ఈ విషయం జగన్ తో బాటు దేశంలో ఉన్న వాళ్లకూ తెలుసు. అయితే వాటిని ఎదుర్కొనే విషయంలో జగన్ ఎటువంటి పావులు జరుపుతారన్నది వేచి చూడాల్సిన విషయం.

చివరిగా ఒక్క మాట.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తొండి చెయ్యి ..ఆంధ్రాకు మొండి చెయ్యి చూపించారేంటంటూ ఒక పార్టీ పెద్దమనిషిని అడిగితే " తొండోళ్ళకు తొండి చెయ్యి మొండోళ్లకు మొండి చెయ్యంటూ" అంటూ నన్ను సరిచేసాడాయన ! అసలు బడ్జెట్లో కేటాయింపుల విషయం పక్కన పెడితే దానిపై స్పందించడానికే ఇష్టపడని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొడిపొడి మాటలతో తమ పార్టీ నాయకులతో మొహమాటపు వ్యాఖ్యలు చేసి సరిపుచ్చారంటే వాళ్ళ భయాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.  ఏదైతేనేం.. మోదీ-షాలు ఎప్పుడు..ఏ పాచికలేస్తారో…ఇక్కడ మాత్రం లాగులు తడిచిపోతున్నాయి !


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle