newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

అమ్మో.. ప్రధాని మోడీ భద్రతకు అంత ఖర్చా?

13-02-202013-02-2020 13:44:58 IST
2020-02-13T08:14:58.870Z13-02-2020 2020-02-13T08:14:55.537Z - - 14-08-2020

అమ్మో.. ప్రధాని మోడీ భద్రతకు అంత ఖర్చా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా వీఐపీల భద్రతకు భారీగానే ఖర్చవుతోంది. ప్రధాని మోడీ భద్రతకు రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? మోడీకి ఉన్న సెక్యూరిటీ కారణంగా ఖజానాకు అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.1.62 కోట్లు అని  లోక్‌సభకు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. దేశంలో ఎంతమంది ప్రముఖులకు SPG, CRPF భద్రత కల్పిస్తున్నారన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారంటూ పరోక్షంగా ప్రధాని మోడీ పేరును ప్రస్తావించిన మంత్రి.. ఇందుకోసం రోజుకు దాదాపు 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.  దీంతో పాటు మొత్తంగా 56 మంది  వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తోంది కేంద్ర హోంశాఖ.

మొత్తం 3 వేలమంది ప్రత్యేక కమాండోలున్న SPGకి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.592.55 కోట్లు కేటాయించారు. గతంలో ఇది రూ.540 కోట్లు కాగా, ఈసారి దానికి 10శాతం పెంచారు. నిన్నమొన్నటి వరకు ప్రధానితోపాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండగా, గతేడాది నవంబరులో కేంద్రం దాన్ని తొలగించింది. ఇప్పుడు ఈ భద్రత కేవలం ప్రధానికి మాత్రమే వుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle