newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

GMR ఎయిర్ పోర్టునుంచి ఇంగ్లాండ్ కు ప్రత్యేక విమానం

18-04-202018-04-2020 09:11:15 IST
Updated On 18-04-2020 09:32:26 ISTUpdated On 18-04-20202020-04-18T03:41:15.405Z18-04-2020 2020-04-18T03:41:00.211Z - 2020-04-18T04:02:26.254Z - 18-04-2020

GMR ఎయిర్ పోర్టునుంచి ఇంగ్లాండ్ కు ప్రత్యేక విమానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచమంతా ఇప్పుడు కోవిడ్-19 మహమ్మరితో చిగురుటాకులా వణుకుతోంది. భారతదేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉన్న సందర్భంలో, కోవిడ్-19 రిలీఫ్ మరియు తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూ GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారిని సరిహద్దులు దాటించింది.  దీనిలో భాగంగా హైదరాబాద్ నుంచి కొందరు UK జాతీయులను తమ స్వదేశానికి తరలించేందుకు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రత్యేక విమానం హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చింది.

ఈ ప్రత్యేక విమానం BA9116 (అరైవల్స్)/BA9117 (డిపార్చర్) సాయంత్రం 4.59 గంటల సమయంలో బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌లో దిగి, సాయంత్రం 6.46 గంటల సమయంలో 136 మంది UK జాతీయులను విమానంలో ఎక్కించుకుని అహ్మదాబాద్‌కు వెళ్లింది. అక్కడ మరికొందరు UK జాతీయులను ఎక్కించుకొని బహ్రెయిన్‌కు వెళ్లి, అక్కడి నుంచి లండన్‌కు చేరుకుంది.  

ఈ ప్రయాణికుల  కోసం పూర్తిగా శానిటైజ్ చేసిన ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌ను సిద్ధంగా ఉంచారు. UK డిప్యూటీ హై కమిషన్, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో ఈ UK జాతీయులంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల నుంచి సుమారు మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత విమానాశ్రయానికి వచ్చారు. కరోనా వైరస్ విజృంభించిన నాటి నుంచి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు పలుచోట్ల చిక్కుకుపోయి, లాక్ డౌన్ కారణంగా తమ స్వస్థలాలకు వెళ్లలేక చాలా ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం వీరిని వారివారి స్వదేశాలకు తరలించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, మేం మా భాగస్వాములందరితో కలిసి వారు సురక్షితంగా వారి స్వదేశాలకు తరలివెళ్లడానికి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్, తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన UK జాతీయులను వారి స్వదేశానికి తరలించడంలో భాగస్వామ్యం పంచుకుంటున్నాం అన్నారు జీహెచ్ఐఎఎల్ సీఈవో కిషోర్. 

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశానికి, సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, అనుకున్నట్లుగానే నేటి ప్లయిట్ ద్వారా ప్రయాణికులను వారి స్వదేశానికి తరలించడానికి నిరంతరం కృషి చేసిన విమానాశ్రయ సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి, UK డిప్యూటీ హై కమిషన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాఅన్నారు.

ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మాట్లాడారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్రిటిష్ జాతీయులు, వారి దగ్గరి వారు నేడు వారి స్వదేశానికి వెళుతుండడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, బ్రిటిష్ ఎయిర్ వేస్, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది సహకారం లేనిదే ఈ తరలింపు సాధ్యమయ్యేది కాదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4 వేల మందికి పైగా బ్రిటిష్ పర్యాటకులను మా స్వదేశానికి పంపడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది’’ అన్నారు. 

ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి GHIAL కు చెందిన టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, AOCC, ATC, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఇమిగ్రేషన్, కస్టమ్స్, APHO (ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్), ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ARFF (ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్) సేవలు RAXA సెక్యూరిటీ, ట్రాలీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సేవలు అందించారు. టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు.  

ఏప్రిల్ 17, 2020 నాటికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు ఎవాక్యుయేషన్ విమానాల ద్వారా 600కు పైగా విదేశీయులను జర్మనీ, అమెరికా, యూకేలాంటి వారి స్వదేశాలకు పంపారు.  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకవైపు నిరంతరం తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూనే మరో వైపు సప్లై చెయిన్ విమానాలు నడిచేందుకు నిరంతరం సహకరిస్తూ, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తోంది. గ్రౌండ్ హ్యండ్లరు, ఫార్వర్డర్లు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు, రెగ్యులేటర్లు, రాష్ట్ర పోలీసులు, కార్గో ట్రేడ్ అసోసియేషన్లతో కలిసి అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులు నిరంతరం రవాణా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   11 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   7 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   9 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   14 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   17 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   18 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle