900 స్థానాలకు పైగా కైవసం చేసుకున్న టీఆర్ఎస్
25-01-202025-01-2020 13:02:55 IST
Updated On 25-01-2020 13:24:13 ISTUpdated On 25-01-20202020-01-25T07:32:55.454Z25-01-2020 2020-01-25T07:32:53.124Z - 2020-01-25T07:54:13.821Z - 25-01-2020

కారు - జోరుకి బ్రేకులు లేకుండా పోయాయి. 900 స్థానాలకు పైగా కైవసం చేసుకుని విజయ వైపుగా తెరాస దూసుకుపోతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. ఆమన్‌గల్ మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది. మరోవైపు ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్ చేరుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో కలిసి ఫలితాలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీల్లో 80 వార్డులు ఏకగ్రీవం కాగా 324 డివిజన్లు, 2,647 వార్డులకు అధికారులు పోలింగ్‌ను నిర్వహించారు. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుఓటములు సహజమే అయినా రాబోయే పదవులకు కొలమానం కావడంతో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇజ్జత్ కా సవాల్ గా వీటిని స్వీకరించారు. వివిధ మునిసిపాలిటీలను టీఆర్ఎస్ అభ్యర్ధులు అప్రతహిత మెజారిటీతో కైవసం చేసుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మహాన్యూస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్ స్కైబ్ చేసుకోండి. అందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.youtube.com/user/mahaanews/videos

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
4 hours ago

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం
5 hours ago

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుపతిలో
33 minutes ago

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన
7 hours ago

ఈ టైంలో అవసరమా మేడమ్
8 hours ago

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
5 minutes ago

ఏంది సార్.. మరీ ఇంత దిగజారిపోయారా
2 hours ago

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
8 hours ago

ఇక కేటీఆర్ టైం వచ్చినట్లేనా
9 hours ago

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
18-04-2021
ఇంకా