newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

8 రోజుల్లో కేసులు రెట్టింపు... తెలంగాణలో కరోనా వైరస్ టెర్రర్

05-07-202005-07-2020 09:08:27 IST
Updated On 05-07-2020 10:06:04 ISTUpdated On 05-07-20202020-07-05T03:38:27.311Z05-07-2020 2020-07-05T03:34:19.528Z - 2020-07-05T04:36:04.242Z - 05-07-2020

8 రోజుల్లో కేసులు రెట్టింపు... తెలంగాణలో కరోనా వైరస్ టెర్రర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకో రికార్డు వచ్చిపడుతోంది. గత కొద్ది రోజులుగా 1000 కేసులకు మించి నమోదవుతున్నాయి.  అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రజలు పనుల నిమిత్తం రోడ్లపైకి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిందన్నారు. జూన్‌లో అత్యధికంగా 13 వేల కేసులు నమోదయ్యాయి.  జూలై 3, శుక్రవారం రోజున ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1,658 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

శనివారం కూడా ఆ ఉధృతి కొనసాగింది. 1850 కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1572 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.  జూన్‌ మొదటి వారంలో 938, రెండో వారంలో 1,015, మూడో వారంలో 3,481, నాలుగో వారంలో 7,461 కరోనా కేసులు నమోదయ్యాయి. జూన్ ఒకటో తేదీతో పోల్చితే శనివారం నాటికి రోజుకు 20 రెట్లకు పైగా కేసులు వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి ఈ కేసులు మరీ ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నమోదవుతున్న అత్యధిక పాజిటివ్ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా రాజధాని హైదరాబాద్ పరిధిలోనే ఉండడంతో ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. 

https://www.photojoiner.net/image/k5r8WSZj

రాజధాని ఢిల్లీ తర్వాత అత్యధిక మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నది తెలంగాణలోనేనని వెల్లడించారు. గత నెల రోజుల్లో 12 వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారని తెలిపారు. ప్రస్తుతం 6,556 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, అవసరమైన వారికి టెలీమెడిసిన్‌, వీడియో కాల్‌ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని కరోనా రోగులకు గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రి, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

గతంలో పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపయ్యేందుకు 17 రోజుల సమయం పట్టేది. కానీ, తర్వాత కేవలం 8 రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి. ఇటీవల కరోనా పాజిటివ్ కేసుల్లో యువత, నడి వయస్కులు ఎక్కువగా ఉంటున్నారు. మరోవైపు కరోనా వైరస్‌ బారినపడితే ఎవరూ ఆందోళన అవసరం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.

కఠినమయిన జాగ్రత్తలు పాటిస్తే వేగంగా కోలుకుంటారని వివరించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ రిస్క్‌ రేట్‌ తగ్గుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఈ ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు.వ్యాక్సిన్‌ వచ్చే వరకు వైరస్‌తో ప్రజలంతా కలసి జీవించక తప్పదన్నారు. వైరస్‌ను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా యోధులుగా పనిచేయాలన్నారు. 

రాష్ట్రంలో 18 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నారని, కొత్తగా మరో 5 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిందన్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలపై మరింత స్పష్టంగా బులెటిన్‌ ఇస్తామని, ల్యాబ్‌లవారీగా పరీక్షలు, పాజిటివ్‌ కేసుల వివరాలను అందులో చేరుస్తామన్నారు. రాష్ట్రంలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ పక్కాగా జరుగుతోందని, సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన 50 వేల పరీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభు త్వ ల్యాబ్‌లలో పరీక్షల సామర్థ్యం 6,500కు పెరిగిందని, త్వరలో మరింత పెంచుతామన్నారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే 104 కు కాల్‌ చేయాలని, అత్యవసర సేవల కోసం 108కి ఫోన్‌ చేయాలని సూచించారు. కేసులు పెరుగుతుండడంతో వాటిని అదుపుచేయడానికి ఏం చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle