newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

25-05-202025-05-2020 12:38:47 IST
Updated On 25-05-2020 15:41:14 ISTUpdated On 25-05-20202020-05-25T07:08:47.080Z25-05-2020 2020-05-25T07:08:33.610Z - 2020-05-25T10:11:14.509Z - 25-05-2020

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుమారు రెండునెలల అనంతరం కరోనా లాక్ డౌన్ అమలవుతున్నా దేశీయ విమాన సేవలు మాత్రం తిరిగి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులకు అష్టకష్టాలు తప్పడంలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. 

దీంతో గంటల తరబడి లాంజ్ లలో విమానాల కోసం వేచి చూస్తున్నారు. శంషాబాద్ కు 100కి పైగా విమానాలు రాకపోకలు సాగించాలి. కానీ ఇవాళ 30 విమానాలు మాత్రమే రానున్నాయని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో ఎయిరిండియా అనేక సర్వీసులను రద్దు చేసింది.

విమానాల రద్దు విషయం తెలియక ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రయాణికులు ఆగ్రహించారు. ఆందోళనకు దిగారు. ప్రత్యమ్నాయం చెప్పకపోవడంతో అగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. రద్దయిన విమానాల వివరాలు చెప్పటానికి నిరాకరిస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ ఆధికారులు. ఆధికారుల నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

విదేశాల నుంచి వచ్చే వారికి జాగ్రత్తలు

* విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి 14రోజులు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇనిస్టిట్యూషనల్‌  క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత మరో ఏడు రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉండాలి.

*  తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 సంవత్సరాలలోపు వయసు కలిగిన చిన్నారులు, వారి * తల్లిదండ్రులకు నిర్దేశిత క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

* ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

* ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.

*రోడ్డు మార్గాన దేశంలోకి ప్రవేశించే ప్రయాణీకులు కూడా అన్ని ప్రోటోకాల్‌ నిబంధనలు అనుసరించాల్సిందే. ఎటువంటి లక్షణాలు లేని వారు మాత్రమే సరిహద్దు ద్వారా భారతదేశంలోకి వచ్చేందుకు అనుమతిస్తారు.

*విమానంలో, ఓడలో వచ్చే వారు.. స్వీయ-డిక్లరేషన్ ఫారం నింపాలి. దాని ప్రతిని విమానాశ్రయం,  ఓడరేవుల్లోని ఇన్‌యాడ్‌పోర్ట్ వద్ద ఉన్న ఆరోగ్య, ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందించాలి.

*విమానాలు, విమానాశ్రయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.

*బోర్డింగ్‌ సమయంలో ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించాలి.

*ప్రయాణ సమయంలో విధిగా మాస్క్‌ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉండేలా హ్యాండ్‌ శానిటైజర్లు వాడాలి

*ఆరోగ్య, ఇమిగ్రేషన్‌ అధికారులు చేసే థర్మల్‌ స్క్రీనింగ్‌కు అందరూ సహకరించాలి.

* కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు, మిగిలిన ప్రయాణికులకు క్వారంటైన్‌ వసతిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కల్పించాలి.

* ప్రతి ప్రయాణికుడిని ఐసీఎంఆర్‌ ప్రమాణాల ప్రకారం పరీక్షించాలి.

* ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్‌ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.

* సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న కాలంలో, ఆ తరువాత అయినా..  ఏదైనా లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్యశాఖకు తెలియచేయాలి. 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle