newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

5న కేబినెట్ భేటీ.. కీలకాంశాలపై చర్చ

02-08-202002-08-2020 08:56:24 IST
Updated On 02-08-2020 13:45:57 ISTUpdated On 02-08-20202020-08-02T03:26:24.527Z02-08-2020 2020-08-02T03:26:20.237Z - 2020-08-02T08:15:57.167Z - 02-08-2020

5న కేబినెట్ భేటీ.. కీలకాంశాలపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న ఉన్న వేళ ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులను మంత్రి వర్గంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన సచివాలయం, నియంత్రిత సాగు, కరోనా వల్ల విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలు కూడా కేబినెట్‌లో చర్చకు రానున్నాయి.రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అసలే వర్షకాలం... ఆ పై కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కానీ లాక్ డౌన్ మళ్లీ విధించే పరిస్థితి లేనందున ఏం చేయాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

కొత్త సచివాలయ ఆకృతిపై పలు మార్పులను కూడా కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సచివాలయం నిర్మాణంపై సీఎం సుదీర్ఘ సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్ వల్ల గత అకడమిక్ ఇయర్ పరీక్షలు లేకుండానే కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు పాస్ చేయించిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉండటంతో.. ఇంటర్నల్స్ ఆధారంగా పాస్ చేయించారు. తెలంగాణ, ఏపీ కాక దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాన్నే అవలంభించారు. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలచేశారు. అలాగే అన్ లాక్ 3 సడలింపులు, విద్యాసంస్థలు తెరిచే అంశాలు, అంతర్రాష్ట్ర వాహనాలకు అనుమతి వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle