48 గంటల్లో 130 కేసులు.. తెలంగాణలో ఏం జరుగుతుంది?
13-05-202013-05-2020 16:06:38 IST
Updated On 13-05-2020 16:38:18 ISTUpdated On 13-05-20202020-05-13T10:36:38.241Z13-05-2020 2020-05-13T10:36:30.709Z - 2020-05-13T11:08:18.867Z - 13-05-2020

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి గత మూడు నాలుగు రోజుల క్రితం వరకు సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. కానీ గత రెండు రోజులుగా ఇది ఒక్కసారిగా మళ్లీ అర్ధ సెంచరీ దాటేసి పైకి ఎగబాకింది. సోమవారం ఒక్కరోజు 79 పాజిటివ్ కేసులు నమోదు కాగా మంగళవారం అదే బాట కొనసాగుతూ 51 కేసులు బయటపడ్డాయి. అంటే కేవలం 48 గంటలలో రాష్ట్రంలో 130 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో సహజంగానే రాష్ట్ర ప్రజలలో ఆందోళన మొదలైంది. ఇదేంటి మళ్లీ ఒక్కసారిగా భారీగా కేసులు బయటపడుతున్నాయని పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఒక్కసారి ఇక్కడ పరిస్థితులను గమనిస్తే రెండు రోజులలో బయటపడ్డ 130 కేసులలో 116 కేసులు కేవలం ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే బయటపడ్డాయి. మిగతా 14 కేసులు ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులుగా తెలుస్తుంది. అంటే ఒక్క జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో ఎక్కడా కొత్త కేసులు రావడం లేదు. ఇక వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోగా రాష్ట్రంలో మరో 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంటే ఈ 26 జిల్లాలలో కూడా ప్రభుత్వం లెక్కల ప్రకారం కరోనా లేనట్లే అనుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1326కి చేరగా వీరిలో 822 మంది డిశ్చార్జి కాగా.. 32 మంది మరణించారు. ప్రస్తుతం 472 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం.. మరోపక్క నగరంలో వాహనాల రద్దీ పెరగడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. నగరంలో కంటెన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ మరింత కటినతరం చేయడంతో పాటు విధిగా రోడ్ల మీదకి వచ్చేవారిని తనిఖీలు చేయాలని నగర వాసులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్థల కార్యకలాపాలకు సడలింపులు ఇవ్వడంతో పాటు నగరంలోని ఐటీ కారిడార్ లో కూడా 33 శాతం కంపెనీలకు అనుమతి ఇచ్చేశారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కేసులను దాచి లెక్కల గోల్ మాల్ చేస్తుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు కూడా నివేదికను కోరింది. అయితే.. హైకోర్టు నివేదిక కోరిన మరుసటి రోజు నుండే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కాగా ఇప్పటికే టెస్టుల విషయంలో ప్రతిపక్షాలు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలలో ప్రభుత్వం అసలు టెస్టుల చేయడం అపేసిందని.. అందుకే కేసులు బయటకి రావడం లేదని కొందరు ఆరోపిస్తుండగా ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రాతిపదికనే చేస్తున్నామని చెప్తుంది. అయితే రెండు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుదలతో ఒకవిధమైన ఆందోళన కొనసాగుతుండడం మాత్రం నిజమనే చెప్పుకోవాలి.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
11 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
7 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
9 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
14 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
17 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
18 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
19 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా