newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

4. 4 రోజుల బిడ్డ ఖరీదు 5 వేలు.. ఆడపిల్లంటే ఇంత వివక్షా?

08-05-202008-05-2020 09:26:31 IST
Updated On 08-05-2020 10:14:30 ISTUpdated On 08-05-20202020-05-08T03:56:31.405Z08-05-2020 2020-05-08T03:56:29.440Z - 2020-05-08T04:44:30.706Z - 08-05-2020

4. 4 రోజుల బిడ్డ ఖరీదు 5 వేలు.. ఆడపిల్లంటే ఇంత వివక్షా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏడు దశాబ్దాల మన స్వతంత్ర భారతంలో ఇంకా ఆడపిల్లపై వివక్ష కరగడం లేదు. మన సమాజంలో లింగవివక్ష అనే జాడ్యం వేళ్ళూనుకుపోయి ఎంతకీ విడవడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్నెన్ని శిక్షలు వేసినా సమాజం హృదయంలో మాత్రం చిన్నచూపు మాసిపోవడం లేదు. ఇప్పటికీ పుట్టిన పురిటి బిడ్డను బేరం పెట్టే మనుషులు మన మధ్యలో జీవిస్తుండడం తీవ్ర విచారకరం.

భూమ్మీద పడి నిండా నాలుగు రోజులు కాకముందే.. తల్లిని కళ్లారా చూడకముందే ఆ ముక్కుపచ్చలారని పసికందుని జస్ట్ ఐదు వేల రూపాయలకు బేరం పెట్టేశారు. ఇది దేశంలో ఎక్కడో వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకొనే బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో జరిగిన ఘటన కాదు మన తెలంగాణ సమాజం తలదించుకునేలా మెదక్ జిల్లాలోనే జరిగిన ఘటన కావడం దిగ్బ్రాంతికి గురిచేస్తుంది.

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ తాండలో ఈ అమానుష ఘటన జరిగింది. పసిబిడ్డ తల్లిదండ్రులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా మూడో సంతానంగా

పుట్టడమే ఇప్పుడు ఈ ఆడపిల్ల చేసిన పాపం. మగపిల్లవాడి కోసం ప్రయత్నిస్తున్న కుటుంబ పెద్దలు మళ్ళీ ఆడపిల్లే పుట్టడంతో తల్లి నుండి బిడ్డను వేరు చేసేందుకు సిద్దపడి బేరం పెట్టారు.

బిడ్డను కనుక్కోవాలని సిద్ధపడిన అవతలి వారిది మరో కథ. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళకి పిల్లల భాగ్యంలేకపోవడంతో డబ్బుతో ఆ భాగ్యాన్ని కొనుక్కోవాలనుకున్నారు. ఇక ఇప్పటికే ఇద్దరు ఆడబిడ్డలను కని ఇప్పుడు మరోసారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిన ఆ తల్లిని కూడా భర్త నుండి వేరుచేసి మరో పెళ్లి చేసేందుకు కూడా కుటుంబ పెద్దలు సిద్దమైనట్లుగా స్థానికులు చెప్పడం విస్తుపోయేలా చేస్తుంది.

ఇంకా మన సమాజంలో ఇంతటి మూర్ఖపు మనుషులు ఉన్నారా.. మనిషి అంతరిక్షంలో జీవించేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఎంతో వృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటాం. కానీ ఇదే సమాజంలో కనీసం ఈ భూమి మీద ఆడపిల్లకు బ్రతికే హక్కు కూడా ఉందని ఇప్పటికీ గుర్తించలేని మనుషులు ఉండడం ఎంతటి నీచమో అర్ధంకాని ఆవేదన.

ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో ఈ వివక్ష కారణంగా స్తీ-పురుష నిష్పత్తిలో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ఆడ-మగ తెలిపే స్కానింగ్ తో అమ్మ కడుపులోనే పసిగుడ్డును నలిపేసి రాక్షస ఆనందం పొందారు. ప్రభుత్వ కఠిన చట్టాలతో కొద్దిగా మార్పులు వచ్చినా భూమి మీద పడ్డాక కూడా చిట్టితల్లికి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇలాంటి ఆటవిక మనుషులు ఉండగా ఈ సమాజంలో మార్పు రాదేమో!

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle