newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

36వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె..సర్కార్ మోసం చేస్తోందన్న విపక్షం

08-11-201908-11-2019 08:35:50 IST
2019-11-08T03:05:50.337Z08-11-2019 2019-11-08T03:05:40.458Z - - 15-08-2020

36వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె..సర్కార్ మోసం చేస్తోందన్న విపక్షం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీకి వున్న బకాయిలు చెల్లించాలంటూ ఆర్టీసీ జేఏసీ పిలుపుతో చేపట్టిన సమ్మె 36వ రోజుకి చేరింది. సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. స్వయానా అధికారులే తప్పుడు లెక్కలు ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 

ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని.. ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామని సీఎల్పి నేత భట్టివిక్రమార్క గుర్తుచేశారు. అప్పులు-బకాయిల విషయంలో అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటు తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపై అసలు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. శాసనసభ, హైకోర్టు, ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠిన వైఖరి సమంజసం కాదన్నారు. ప్రజలతో పాటు హైకోర్టు, శాసనసభలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని భట్టి మండిపడ్డారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ కార్మికుల గుండెపోట్లు, ఆత్మహత్యలపై టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల మరణాలన్నీ  ప్రభుత్వ హత్యలేనని కోదండరాం అన్నారు. 11వ తేదీలోపు మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ తీరుని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఖండించారు. 

ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని చెప్పారు. కార్మికులు బరితెగించి కొట్లాడుతుంటే కేసీఆర్‌ గిరి గీసుకొని ఉన్నారని, ఆ గిరే మీకు ఉరితాడు అవుతుందని టీటీడీపీ అధ్యక్షుడు రమణ  సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

గుండెపోటు, ఆత్మహత్యలకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అంతా అండగా ఉండాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌గౌడ్‌ కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష చొప్పున మిగతా 20 మంది కార్మిక కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందజేస్తానన్నారు రమణ. ఛల్ ట్యాంక్ బండ్ కు టీటీడీపీ మద్దతు ఇస్తోందన్నారు. 

మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శుక్రవారం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది జేఏసీ.

మరో మిలియన్‌ మార్చ్‌ తరహాలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమానికి టీఆర్ఎస్ యేతర పార్టీలు తమ సంఘీభావం ప్రకటించాయి.  కార్మికుల కుటుంబ సభ్యులతోపాటు ఆయా పార్టీల నుంచి భారీగా కార్యకర్తలు తరలి వచ్చేలా ఇటు జేఏసీ, అటు పార్టీలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉస్మానియా విద్యార్దులు కూడా ఈ ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గోనేలా వారితో చర్చలు జరుపుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle