newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

33మంది ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు

07-12-201907-12-2019 08:28:23 IST
Updated On 07-12-2019 13:04:29 ISTUpdated On 07-12-20192019-12-07T02:58:23.675Z07-12-2019 2019-12-07T02:58:08.843Z - 2019-12-07T07:34:29.690Z - 07-12-2019

33మంది ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజులకు పైగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఉద్యోగులలో ఎంతోమంది గుండెపోటు, ఇతర అనారోగ్యాలతో మరణించగా, కొందరు బలిదానాలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించడం, తిరిగి విధుల్లో చేరడానికి సీఎం కేసీయార్ ని ఒప్పించారు.

ఆర్టీసీ ఉద్యోగుల మొర ఆలకించిన కేసీయార్ ఉద్యోగులకు వరాలు ప్రకటించారు. గతంలో ఆయన వ్యవహరించిన తీరుకి భిన్నంగా ఉద్యోగులకు ఊరట నిచ్చే ప్రకటనలు చేశారు. వారితో కలిసి భోజనం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 1వ తేదీన సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం దిశగా టీఎస్‌ఆర్టీసీ అధికారులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదేశాలతో సమ్మె కాలంలో మరణించిన 33 మంది ఉద్యోగుల పిల్లలకు విద్యార్హతలను బట్టి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరణించిన 38 మంది ఉద్యోగులకు సంబంధించి 22 కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు.

త్వరలో మరో 16 కుటుంబాలకు పరిహారం ఇవాళ అందజేయనున్నారు.  మహిళా ఉద్యోగుల డ్యూటీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి.  మహిళా ఉద్యోగుల కోసం ఈ నెల 15 లోగా హైదరాబాద్‌ నగరంలో విశ్రాంతి గదులతో పాటు, డిపోలు, హైదరాబాద్‌ సిటీ చేంజ్‌ఓవర్‌ పాయింట్ల వద్ద టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు.

అధికారుల ఆదేశాల ప్రకారం ఐదుగురికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఐదుగురికి ఆర్టీసీ కానిస్టేబుల్, ఒకరికి కండక్టర్ ఉద్యోగాలు కేటాయించారు. దీనికి సంబంధించిన నియామకపత్రాలు సంబంధిత ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అందచేశారు. వారు త్వరలో ఉద్యోగాల్లో చేరతారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కేసీఆర్‌ హామీ నెరేవేరడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle