newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

22 రోజుల చికిత్స.. 20లక్షల బిల్లు ..కార్పో‘రేట్’ ఆస్పత్రి లీలలు

15-08-202015-08-2020 18:34:09 IST
2020-08-15T13:04:09.341Z15-08-2020 2020-08-15T13:03:57.886Z - - 14-04-2021

22 రోజుల చికిత్స.. 20లక్షల బిల్లు ..కార్పో‘రేట్’ ఆస్పత్రి లీలలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ సోకితే అంతేనా. ప్రైవేటు ఆస్పత్రులు జనాల్ని పీల్చిపిప్పి చేస్తున్నాయనడానికి ఈ కేసే ఉదాహరణ. ఓ సెక్యూరిటీ గార్డ్ కు కరోనా సోకింది. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు. 22 రోజుల ట్రీట్మెంట్ తరువాత అతను చనిపోతే 20 లక్షల బిల్లు వేశారు. ఇదేంటని అడిగితే అదంతే అన్నారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ కొంచెం చెల్లిస్తే, వారిదగ్గర ఇవ్వడానికేం మిగలలేదు. మిగతా డబ్బులు కడితేనే డెడ్ బాడీ ఇస్తామన్నారు. చివరాఖరుకు ఆందోళన చేస్తే అప్పగించారు. హైదరాబాద్ రాబందుల్లా పీక్కుతింటున్న కార్పోరేట్ ఆస్పత్రి ఉదంతం ఇది.

హైదరాబాద్ లోని ముషీరాబాద్‌కు చెందిన 49 సంవత్సరాల ఓ వ్యక్తి సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జూలై నెల 20వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. అతను పనిచేసే సంస్థకు చెందిన ఇన్య్సూరెన్స్‌ నుంచి డబ్బు చెల్లించేందుకు వారు ఒప్పుకున్నారు. ఇలా 22 రోజులకు గాను రూ. 20 లక్షల బిల్లు వేశారు. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయన మరణించారు. 

చికిత్సకు ఏకంగా రూ. 20 లక్షలు బిల్లు అయింది.  బీమా కంపెనీ ఇచ్చిన సొమ్ము కాకుండా మరో రూ. 8 లక్షలు చెల్లించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో నిరుపేద అయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. విషయం చెప్పి మృతదేహం ఇవ్వాలని కోరినా ఆస్పత్రి వారు అప్పగించలేదు.

విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాల నాయకులు అక్కడికొచ్చి ఆస్పత్రి ముందు నిరసన తెలిపాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం... జీహెచ్‌ఎంసీ, పోలీసులు సకాలంలో రాకపోవడంతో మృతదేహం అప్పగింతలో ఆలస్యం జరిగిందని సాకు చెప్పింది. ప్రైవేటు యాజమాన్యాల తీరుపై ఇప్పటికే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle