newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

22నుంచి తెలంగాణలో బీజేపీ సంకల్పయాత్ర

21-10-201921-10-2019 08:49:59 IST
2019-10-21T03:19:59.596Z21-10-2019 2019-10-21T03:14:24.727Z - - 22-02-2020

22నుంచి తెలంగాణలో బీజేపీ సంకల్పయాత్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఏపీలో ఇప్పటికే గాంధీ సంకల్పయాత్రలు చేపట్టినట్టుగా తెలంగాణ బీజేపీ కూడా ఈనెల 22నుంచి జనం ముందుకి వెళ్లబోతోంది. మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని మంగళ వారం నుంచి తెలంగాణలో సంకల్ప యాత్రలు చేపట్టనున్నట్లు భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. 

ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ పదాధి కారుల జరిగిన సమావేశంలో ఈ గాంధీ సంకల్పయాత్రల రూట్ మ్యాప్ ఖరారుచేశారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అనుసరించా ల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. బతుకమ్మ, దసరా పండుగ, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక తదితర అంశాల కారణంగా, లోక్‌సభ నియోజకవర్గాలలో సంకల్ప యాత్రలు నిర్వహించలేదని పార్టీ నేతలు ప్రకటించారు. 

దీంతో ఈ నెల 22 వ తేదీ నుంచి గాంధీ సంకల్పయాత్రలు చేపట్టనున్నారు. 15 రోజుల పాటు సాగే యాత్ర రోజుకు కనీసం 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఎంపీ జి. కిషన్‌రెడ్డితో పాటు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, కరీం నగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌లు ప్రారంభించారు.

పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నవంబర్‌ 8 లోగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలో పార్టీ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 33 వేల పోలింగ్‌ కేంద్రాలుండగా, కేవలం అయిదు వేల పోలింగ్‌ కేంద్రాలలో కమిటీలను పూర్తి చేశారు. మిగతా కేంద్రాలలో నవంబర్‌ 8 లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. గాంధీ సిద్ధాంతాలు, మోడీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళతారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను సంకల్పయాత్ర ద్వారా ఎండగడతారు.  

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   7 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   10 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   10 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   11 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   12 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   15 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle