newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2019లో బెస్ట్ ఎయిర్ పోర్ట్‌గా శంషాబాద్.. అరుదైన గుర్తింపు

10-03-202010-03-2020 09:55:32 IST
2020-03-10T04:25:32.506Z10-03-2020 2020-03-10T04:23:16.684Z - - 20-04-2021

2019లో బెస్ట్ ఎయిర్ పోర్ట్‌గా శంషాబాద్.. అరుదైన గుర్తింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. తాజాగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు లభించింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ‘ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణించే విమానాశ్రయాల శంషాబాద్ చేరింది.

దేశంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతతో కూడిన మెరుగైన సేవలు అందిస్తోంది. అంతేకాదు పర్యావరణం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వంటి వాటికి గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబరులో పోలెండ్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పురస్కారాన్ని అందించనుంది. విమానాశ్రయానికి ఈ పురస్కారం రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి గుర్తింపు రావడం ఇదే ప్రథమం కాదు. 

గత ఏడాది కూడా ఎయిర్ పోర్ట్ పురస్కారానికి ఎంపికైంది. ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ శంషాబాద్ కు  చోటు దక్కింది. విమానాల రాకపోకల్లో సమయపాలన, ఫుడ్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రయాణికులకు మెరుగైన సేవలు వంటి పలు అంశాలను అధికారులు ప్రాతిపదికగా తీసుకుంటారు.

2019 ఏడాదికి ప్రపంచ టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలను ఎంపిక చేయగా అందులో శంషాబాద్ విమానాశ్రయానికి టాప్ 8 ప్లేస్ దక్కింది. ఒకటి, రెండు స్థానాల్లో ఖతార్, జపాన్ ఎయిర్ పోర్టులు నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయం హైదరాబాద్ నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ వద్ద నెలకొల్పబడింది.

అప్పట్లో ఆ ప్రాంతం చాలా వెనుకబడి వుంది. విమానాశ్రయం రాకతో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండవ విమానాశ్రయం కావడం విశేషం.  2010-11 లో భారత దేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవ స్థానం పొందింది. ఈ ఎయిర్ పోర్ట్ ఏడాదికి 40 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఉద్దేశించబడింది. 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   12 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   18 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle