newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

2న తెలంగాణ కేబినెట్ భేటీ.. 3 నుంచి 17వరకూ లాక్ డౌన్

30-06-202030-06-2020 07:26:05 IST
Updated On 30-06-2020 07:37:17 ISTUpdated On 30-06-20202020-06-30T01:56:05.480Z30-06-2020 2020-06-30T01:55:42.801Z - 2020-06-30T02:07:17.233Z - 30-06-2020

2న తెలంగాణ కేబినెట్ భేటీ.. 3 నుంచి 17వరకూ లాక్ డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోమారు కట్టడి చేయాలని, లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించడంతో దానిపై చర్చించి ప్రకటన చేయనున్నారు సీఎం కేసీయార్.

లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం రెండు గంట లు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులివ్వనుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. లాక్‌డౌన్‌ అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఏర్పడనున్న పరిణామాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 

జూలై 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించే అవకాశముంది. దీంతో పాటు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీని గురించి కూడా మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. గతేడాది జూన్‌ 27న సీఎం కేసీఆర్‌ కొత్త సెక్రటేరియెట్, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇతరులు హైకోర్టులో కేసు దాఖలు కావడంతో పనులు ప్రారంభం కాలేకపోయాయి. సరిగ్గా ఏడాది దాటిన రెండో రోజే హైకోర్టు భవనాల కూల్చివేత, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  దీంతో పనులు వేగవంతం చేయనున్నారు.శ్రావణ మాసంలోగా కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులకు శ్రీకారం చుడతారు.

మరోవైపు లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు విద్యార్ధులను అయోమయానికి గురిచేస్తున్నాయి. జూలై నెలలో జరగబోయే కామన్ ఎంట్రన్స్ టెస్టుల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. జులై 1 నుంచి పలు కామన్ ఎంట్రన్స్‌ టెస్టులు ప్రారంభం అవుతాయి. జులై 1 న జరగాల్సిన పాలిటెక్నిక్ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. జులై 15వ తేదీ వరకూ పలు పరీక్షలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు.

జులై 6 నుంచి 9 వరకూ ఎంసెట్‌ జరగనుంది. దీనికి 2 లక్షల 22వేల మంది అప్లై చేసుకున్నారు. మిగిలిన ఎంట్రన్స్‌ లతో కలిపి మొత్తం 4,68,000 వేల మంది పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న పలు కాలేజీలను ఎంట్రన్స్‌ టెస్టులకు సెంటర్లుగా కూడా ఖరారు చేశారు. ఈ సమయంలో లాక్‌డౌన్ విధిస్తే పరీక్షలు వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle