newssting
BITING NEWS :
*నేడు మంగళగిరిలో పవన్ పర్యటన...డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభించనున్న పవన్ *ఉదయం పదిన్నర గంటలకు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం *సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కేకే, కేటీయార్ అధ్యక్షతన భేటీ * కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ హైకోర్టులో విచారణ*42వ రోజుకి చేరిన ఆర్టీసీ సమ్మె.. విలీనం అంశం వాయిదా *ఇవాళ డిపోల నుంచి గ్రామాలకు బైక్‌ ర్యాలీలు.. 16న నిరవధిక దీక్షలు, 17, 18 తేదీల్లో సామూహిక దీక్షలు.. 19న హైదరాబాద్‌ టు కోదాడ సడక్ బంద్*ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు.. ప్రతీ పనిలోనూ జే ట్యాక్స్ విధిస్తున్నారు-చంద్రబాబు *వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.. జగన్ వెంట నడుస్తానని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

16వ రోజుకి ఆర్టీసీ సమ్మె... గుండెపోటుకి మరో కార్మికుడి బలి

20-10-201920-10-2019 13:27:59 IST
2019-10-20T07:57:59.732Z20-10-2019 2019-10-20T07:57:51.058Z - - 15-11-2019

16వ రోజుకి ఆర్టీసీ సమ్మె... గుండెపోటుకి మరో కార్మికుడి బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సెప్టెంబర్ నెల జీతాలు రాకపోవడం, భవిష్యత్తుమీద బెంగతో కార్మికులు మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారు. సర్కార్ మొండి వైఖరితో మరో కార్మికుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్‌ ఎస్కే ఖాజామియా గుండెపోటుతో మరణించాడు. 

15 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మెలో ఖాజామియా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఖాజామియా మనస్తాపంతో మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఖాజామియా మృతిపట్ల ఆర్టీసీ జేఏసీ, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. యాజమాన్యం పిలిస్తే చర్చలకు సిద్ధమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రాజకీయ జేఏసీతో కార్మిక సంఘాలు భేటీ అయి భవిష్యత్ ఆందోళనకు సంబంధించి కార్యాచరణపై చర్చించనున్నాయి. 

ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్దామరెడ్డి సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంద్‌తో సమ్మె ముగిసినట్టు కాదని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పరిస్థితి ఇలాగే ఉంటే రాజకీయ సంక్షోభం వస్తుందని  హైకోర్టు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్‌  గుర్తించాలని అశ్వథ్దామరెడ్డి, జేఏసీ నేతలు సూచించారు. అవసరమైతే తాము మరోసారి గవర్నర్‌ను కలసి పరిస్థితిని విన్నవిస్తామని ఆయన స్పష్టం చేశారు.

రెండురోజుల క్రితం ఓ ఏడీసీ గుండెనొప్పికి గురయి ఆస్పత్రిలో చేరాడు. చిట్యాల పట్టణకేంద్రానికి చెందిన గోసుకొండ మల్లయ్య నల్లగొండ RTC డిపోలో ADCగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెతో త్రివ మనస్తాపానికి గురై ఆందోళనగా ఉన్నాడు. రెండురోజుల క్రితం తెల్లవారుజామున  రెండున్నరగంటలకి మల్లయ్యకి 30 హార్ట్ ఎటాక్ వచ్చింది.

దీంతో కుటుంబ సభ్యులు నార్కెట్ పల్లి కామినేని హాస్పటల్ కు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ గాంది హాస్పటల్ తరలించి వైద్యం నిర్వహిస్తున్నారు. మల్లయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్న సంగతి తెలిసిందే. 

సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీ ఉద్యోగికి హార్ట్ ఎటాక్.. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle