newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

22-02-202022-02-2020 17:00:08 IST
2020-02-22T11:30:08.519Z22-02-2020 2020-02-22T11:30:01.448Z - - 15-04-2021

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అదృశ్య‌మై ప‌న్నెండు రోజులైంది. మొద‌టి రోజే మిస్సింగ్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసుల‌కు ఇప్ప‌టికీ ఎటువంటి క్లూ దొర‌క‌లేదు. అనుమానితుల‌ను ఎంత మందిని విచారించినా ఏ ఒక్క‌రి నుండీ స‌రైన ఆధారాలు ల‌భ్యం కాలేదు. దీంతో మిస్సింగ్ కేసు కాస్త మిస్ట‌రీగా మారింది. మ‌రోప‌క్క, రూములోని బెడ్‌పై, బ‌ట్ట‌ల‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉండ‌టం మ‌రింత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అందులోను సీసీ టీవీ ఫుటేజ్ నుండి అనుకున్నంత స‌మాచారం అంద‌క‌పోవ‌డం, అదృశ్య‌మైన వ్య‌క్తి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండ‌టంతో ఈ కేసు విచార‌ణ పోలీసుల‌కు స‌వాల్‌గా మారింది.

కాగా, మ‌ల్లారెడ్డి క‌లాశాల‌లో బీటెక్ తృతీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న జీవ‌న్‌రెడ్డి ఆచూకీ క‌నిపించ‌కుండా పోయి ప‌న్నెండు రోజులు గ‌డుస్తోంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నా ఇప్ప‌టికీ జీవ‌న్‌రెడ్డికి సంబంధించిన‌ ఆచూకీని ట్రేస్ చేయ‌లేని ప‌రిస్థితి. మ‌రోప‌క్క జీవ‌న్‌రెడ్డి కుటుంబ స‌భ్యులు కూడా జీవ‌న్‌రెడ్డి ఆచూకీ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

కేసు ద‌ర్యాప్తులో భాగంగా జీవ‌న్‌రెడ్డి ఉంటున్న ప్ర‌యివేటు హాస్ట‌ల్‌ను పోలీసులు ఇప్ప‌టికే ప‌రిశీలించారు. అదృశ్యం కాక ముందు ఎవ‌రితో అయితే జీవ‌న్‌రెడ్డికి గొడ‌వ జ‌రిగిందిదో వారంద‌ర్నీ పోలీసులు విచారించినా ఆచూకీ లభ్యం కాని ప‌రిస్థితి. జీవ‌న్‌రెడ్డి ఉంటున్న హాస్ట‌ల్ బాత్ రూములో, అలాగే బెడ్‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు ఉన్న నేప‌థ్యంలో జీవ‌న్‌రెడ్డి కుటుంబ స‌భ్యులు ఒకింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

12 రోజుల క్రితం జీవ‌న్‌రెడ్డికి సంబంధించిన హాస్ట‌ల్ సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు ప‌రిశీలించారు. జీవ‌న్‌రెడ్డి కొంత దూరం వెళ్లిన దృశ్యాలు క‌నిపించినా, ఆ త‌రువాత జీవ‌న్‌రెడ్డి ఎక్క‌డికి వెళ్లాడు అన్న‌ది మాత్రం సీసీ టీవీ ఫుటేజ్‌లో క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. గ‌త 12 రోజులుగా ప్ర‌త్యేక పోలీసుల బ‌ల‌గాలు జీవ‌న్ రెడ్డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అయినా ఆయ‌న ఆచూకీ తెలుసుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి క్లూస్ ల‌భ్యం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు మ‌ల్లారెడ్డి క‌ళాశాల‌లో ఉన్న దివ్యాంగుడితో జీవ‌న్‌రెడ్డి ఆఖ‌రిగా మాట్లాడాడ‌ని తెలియ‌డంతో అత‌న్నీ పోలీసులు విచారించారు. అలాగే మ‌ల్లారెడ్డి కాలేజీతోపాటు, ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఎనిమిది కాలేజీల్లోని విద్యార్థులంద‌ర్నీ పోలీసులు విచారించినా ఎటువంటి క్లూస్ దొర‌క‌లేదు. దీంతో బ‌స్టాండ్‌, రైల్వే స్టేష‌న్‌, ఇలా ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో జీవ‌న్‌రెడ్డి మిస్సింగ్ పోస్ట‌ర్ల‌ను పోలీసులు ఉంచారు. అయినా ఎక్క‌డా ఆచూకీ ల‌భించ‌లేదు. అయితే, జీవ‌న్‌రెడ్డి తీసుకెళ్లిన మొబైల్ స్విచ్ ఆఫ్ వ‌స్తుంద‌ని, స్విచ్ ఆన్ చేస్తే క‌చ్చితంగా ఆయ‌న‌కు సంబంధించిన ఆచూకీ త్వ‌ర‌లోనే ట్రేస్ అవుతుంద‌ని పేట్ బ‌షీరాబాద్ పోలీసులు చెబుతున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle