newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

హ‌రీష్‌ను అందుకే రంగంలోకి దింపారా..?

07-01-202007-01-2020 07:56:16 IST
Updated On 07-01-2020 12:54:18 ISTUpdated On 07-01-20202020-01-07T02:26:16.689Z07-01-2020 2020-01-07T02:26:13.400Z - 2020-01-07T07:24:18.179Z - 07-01-2020

హ‌రీష్‌ను అందుకే రంగంలోకి దింపారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్ర స‌మితిలో ట్ర‌బుల్‌షూట‌ర్‌గా గుర్తింపు పొందారు మంత్రి హ‌రీష్‌రావు. ఉద్య‌మ‌కాలం నుంచి పార్టీకి అన్ని విధాలుగా ఆయ‌న బ‌ల‌మ‌య్యారు. ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌రిగినా, పార్టీకి కీల‌క‌మైన ఎన్నిక‌లు జ‌రిగినా అక్క‌డ హ‌రీష్ రంగ‌ప్ర‌వేశం చేసేవారు.

త‌న రాజ‌కీయ వ్యూహాలు, మాస్ ఇమేజ్‌, ఎల‌క్ష‌నీరింగ్‌తో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకొని వ‌చ్చేవారు. అయితే, ఇటీవ‌ల ప‌లు కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో హ‌రీష్ కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు.

కానీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌నను మ‌రోసారి రంగంలోకి దింపింది టీఆర్ఎస్ అధిష్ఠానం. దీంతో ఆయ‌న త‌న ప‌ని ప్రారంభించారు. ఇప్ప‌టికే స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

కీల‌క‌మైన మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు ప‌రిధిలోని మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల‌తో పాటు గ‌జ్వెల్‌, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు ఆయ‌న‌కు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఈ మున్సిపాలిటీల‌ను టీఆర్ఎస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి పార్టీలో హ‌రీష్‌రావు ప్రాధాన్యం త‌గ్గుతూ కేటీఆర్ ప్రాధాన్య‌త పెరుగుతోంది. ఆ ఎన్నిక‌ల్లో కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గంతో పాటు కేసీఆర్ పోటీ చేసిన గ‌జ్వేల్‌కే హ‌రీష్ ప‌రిమిత‌మ‌య్యారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కేవ‌లం మెద‌క్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ప‌ని చేశారు. కేటీఆర్ మాత్రం ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ రాష్ట్ర‌మంతా తిరిగి ప్ర‌చారం చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చార బాధ్య‌త‌లు కేటీఆర్ తీసుకున్నారు.

అయితే, హ‌రీష్‌రావును కూడా ఈ ఎన్నిక‌ల్లో క్రియాశీల‌కం చేయాల‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించింది. ముఖ్యంగా హైద‌రాబాద్ శివార్ల‌లోని మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు ఉన్నాయి.

పైగా ఇక్క‌డి నుంచి ఎంపీగా పీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌కు కూడా ఇక్క‌డ బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఇక్క‌డి బాధ్య‌త‌ల‌ను హరీష్‌రావు తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న స‌న్నాహ‌క స‌మావేశం కూడా నిర్వ‌హించారు.

ఇంత‌కుముందు కూడా రేవంత్ రెడ్డి దూకుడుకు హ‌రీష్‌రావు చెక్ పెట్టారు. రేవంత్ రెడ్డి స్వంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌పై దృష్టి పెట్టిన హ‌రీష్‌రావు ఇక్క‌డ రేవంత్‌ను ఓడించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

త‌ర్వాత ఆరు నెల‌ల పాటు రేవంత్ రెడ్డి సైలెంట్ అవ్వాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ ఆయ‌న మ‌ల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మ‌రోసారి హ‌రీష్‌రావు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటుపై దృష్టి పెడితే టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి రేవంత్ రెడ్డికి షాక్ త‌గులుతుంద‌ని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

దీంతో పాటు ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని మున్సిపాలిటీల బాధ్య‌త కూడా హ‌రీష్‌రావు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌జ్వేల్ మున్సిపాలిటీతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం సంగారెడ్డి మున్సిపాలిటీపై కూడా హరీష్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తాను ప్ర‌చారం చేయ‌న‌ని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. దీంతో కేటీఆర్ రాష్ట్ర‌మంతా ప్ర‌చారం చేయ‌నున్నారు. హ‌రీష్‌రావు కీల‌క మున్సిపాలిటీల్లో గెలిపించే బాధ్య‌త తీసుకున్నారు. మొత్తానికి హ‌రీష్‌రావు మ‌రోసారి పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle