హ్యాట్సఫ్ అఖిల్.. ఎందరిలోనూ స్ఫూర్తి నింపావ్
30-03-202030-03-2020 10:18:30 IST
Updated On 30-03-2020 11:06:33 ISTUpdated On 30-03-20202020-03-30T04:48:30.894Z30-03-2020 2020-03-30T04:48:02.258Z - 2020-03-30T05:36:33.256Z - 30-03-2020

ఓ పోలీస్ అధికారి విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని క్వారంటైన్‌కు పంపించకుండా ఇంట్లో దాచిపెట్టి ముగ్గురు కరోనా బారిన పడటానికి కారణం అయ్యాడు. పంజాబ్‌లో ఒక మత గురువు విదేశాల్లో తిరిగి వచ్చిన క్వారంటైన్‌కు నిరాకరించి ఊర్లకు ఊర్లే తిరిగి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కరోనా పాజిటీవ్‌గా తేలిన సదరు గురువు కారణంగా ఇప్పుడు 40 వేల మంది క్వారంటైన్లో ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్లో ఉండాలని, కరోనా పరీక్షలు జరిపించుకోవాలని ఎంత చెబుతున్నా మన వాళ్లు వినడం లేదు. ఇటువంటి వారి మధ్య వరంగల్‌కు చెందిన అఖిల్ ఎన్నంశెట్టి ఆదర్శంగా నిలిచాడు. కరోనాపై పోరాటంలో అఖిల్ ఒక స్ఫూర్తి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కోవడంలో అఖిల్ మనందరికీ ఒక గుణపాఠం నేర్పించాడు. లండన్ నుంచి భారత్‌కు వచ్చిన అఖిల్.. తనలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోయినా, ఎయిర్‌పోర్టు అధికారులే థర్మల్ పరీక్షలు జరిపి ఇంటికి వెళ్లవచ్చని చెప్పినా నేరుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు జరిపించుకున్నారు. కరోనా పాజిటీవ్‌గా ఆయన నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నాడు. అఖిల్ కాంటాక్ట్ చైన్‌లో ఒక్కరిని కూడా ఐసొలేషన్‌లోకి తీసుకోవాల్సిన అవసరం పడలేదంటే అఖిల్ ఎంత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్ ఎన్నంశెట్టి సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. పుణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. ప్రస్తుతం యూకేలోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో మానవ హక్కులపై లా పీజీ చేస్తున్నాడు. అంతర్జాతీయ విమానాల రాకపోకలను మన దేశానికి నిలిపివేయడానికి రెండు రోజుల ముందు అంటే మార్చ్ 19న అఖిల్ ముంబాయి మీదుగా హైదరాబాద్ వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు కరోనాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేవు. అఖిల్‌తో పాటు వచ్చిన వారిలో చాలా మంది ఎయిర్‌పోర్టులో దిగే ముందు పారసెటమల్ ట్యాబ్లెట్లు వేసుకొని ఎయిర్‌పోర్టు అధికారులను ఏమార్చి క్వారంటైన్ నుంచి తప్పించుకున్న ఉదాహరణలు చూశాం. కానీ, అఖిల్ మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరించాడు. హైదరాబాద్ వచ్చాక ఎవరినీ కలవలేదు. కనీసం తన కుటుంబ సభ్యులను కూడా చూడలేదు. కరోనాకు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఎయిర్‌పోర్టులో ఆయనను పరీక్షించి హోం క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. కానీ, అఖిల్ ఎవరినీ కలవకుండా నేరుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు జరిపించుకోగా కరోనా పాజిటీవ్ అని తేలింది. సాదారణంగా ఎవరికైనా కరోనా పాజిటీవ్ అని తేలితే సదరు వ్యక్తి ఎంత మందిని కలిశాడనే కాంటాక్ట్ లిస్ట్ ఒకటి తయారు చేసి వారందరినీ క్వారంటైన్ చేస్తుంటారు. కానీ, అఖిల్ దేశంలో ఎవరినీ కలవలేనందున, ఆయన కాంటాక్ట్ ద్వారా ఎవరినీ క్వారంటైన్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ప్రస్తుతం అఖిల్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను కరోనాపై విజయం సాధిస్తానని, తాను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని, అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందని అఖిల్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కరోనా వైరస్ పట్ల ఆసుపత్రి నుంచే ప్రజలకు, ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలా బాధ్యతగా వ్యవహరించాలనేది అఖిల్ నిరూపించాడు. వరంగల్ కేంద్రంగా మానవ హక్కుల కోసం పోరాడే సంస్థను నెలకొల్పి గిరిజనుల పక్షాన, అన్యాయానికి గురవుతున్న వారి పక్షాన పోరాడాలనేది అఖిల్ ఆశయం. ఇందుకు గానూ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నెలకొల్పిన క్లింటన్ ఫౌండేషన్ అఖిల్ ఆలోచనలను మెచ్చి సహకరించేందుకు కూడా ముందుకు వచ్చింది. అఖిల్ కరోనాను జయించి త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే అఖిల్ లాంటి యువకులు మన సమాజానికి చాలా అవసరం.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
8 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
5 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
15 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
15 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
18 hours ago
ఇంకా