newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

హోర్డింగులు: ఆదాయం గోరంత.. సమస్యలు కొండంత

12-06-201912-06-2019 09:07:33 IST
Updated On 24-06-2019 11:54:33 ISTUpdated On 24-06-20192019-06-12T03:37:33.191Z12-06-2019 2019-06-12T03:37:09.791Z - 2019-06-24T06:24:33.468Z - 24-06-2019

హోర్డింగులు: ఆదాయం గోరంత.. సమస్యలు కొండంత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ లో ఎటు చూసినా హోర్డింగ్ లే. వివిధ వ్యాపార ప్రకటనలు, సినిమాలు.. ఒక్కటేంటి? సమస్తం హోర్డింగులలోనే దర్శనం ఇస్తాయి. అయితే ఈ హోర్డింగులపై నిషేధం విధించారు అధికారులు. ఈనెల 15 నుంచి ఆగస్ట్‌ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన  వివిధ విభాగాల ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి కాలంలో హోర్డింగుల ఫ్లెక్సీల ఆటంకాలతో మెట్రో మార్గాల్లో పలు పర్యాయాలు మెట్రోరైళ్లు నిలిచిపోవడం తెలిసిందే. వర్షాకాలంలో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌ కూలిపోయే అవకాశాలున్నాయి.

హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి ప్రస్తావించారు. అయితే మెట్రో రైలు మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌లపై నిషేధం విధించామని,  కొన్ని హోర్డింగ్‌లపై అక్రమంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

అయితే, మెట్రో మార్గంలో ఉన్న  అన్ని హోర్డింగ్‌లను తొలగించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో దాదాపు 2600 హోర్డింగులున్నాయి. ఇవి కాక అనధికారికంగా మరో 2500 వరకు ఉంటాయి. అయితే జీహెచ్‌ఎంసీ తనిఖీల్లో మాత్రం 333 అక్రమ హోర్డింగుల్ని గుర్తించి దాదాపు 300 వరకు తొలగించినట్లు గత సంవత్సరం పేర్కొన్నారు. 

Image result for hyderabad metro rail  hoardings

హోర్డింగుల ఏర్పాటులో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. గోడలపై,  భూమిపై నుంచి ఏర్పాటుచేసే హోర్డింగులు  40 ఇంటూ 25  అడుగుల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. రూఫ్‌ టాప్‌పై ఏర్పాటు చేసేవి రెండంతస్తుల వరకు 30 ఇంటూ 25 అడుగులకు మించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే తమదే బాధ్యత అని ఏజెన్సీలు సొంత పూచీకత్తునివ్వాలి.

కానీ ఇవేవీ అమలుకావడంలేదు. ఈ హోర్డింగుల వల్ల ప్రభుత్వానికి రూ.50 కోట్ల వరకూ ఆదాయం రావాలి. కానీ వాస్తవంగా వస్తోంది మాత్రం 15 కోట్లేనని తెలుస్తోంది. హోర్డింగులపై నిషేధం శాశ్వతంగా ఉండాలని నగరవాసులు, మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle