హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం
11-08-202011-08-2020 09:03:52 IST
Updated On 11-08-2020 11:55:35 ISTUpdated On 11-08-20202020-08-11T03:33:52.353Z11-08-2020 2020-08-11T03:33:35.749Z - 2020-08-11T06:25:35.257Z - 11-08-2020

ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలి. అధికారం, హోదాను పక్కనపెట్టాలి. తెలంగాణలో ఓ మంత్రి చేసిన సాయం అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. కరోనాతో మృత్యువాత పడ్డ వారి అంతిమ సంస్కారాలకు ఎవరూ రావడం లేదు. మానవత్వం విలువలు మరిచిపోతున్నారు. శవాలద్వారా కరోనా రాదని తెలిసినా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం దారుణం అన్నారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్. అంతేకాదు తనలోని మానవీయ కోణం ఆవిష్కరించారు. అంతిమ సంస్కారాలు నిర్వహించినంత మాత్రాన కరోనా అంటుకోదని సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ఆయన పీపీఈ కిట్ వేసుకుని హాజరయ్యారు. గాంధీ తదితర దవాఖానాల్లో కరోనాతో మృతిచెందిన వారిని.. వారి పిల్లలే తీసుకువెళ్లడానికి ముందుకు రాకపోవడం మనుషుల్లోని మృగత్వాన్ని సూచిస్తుందన్నారు. ఆయనే స్వయంగా హాజరైన అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు వేసుకొని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని మంత్రి తెలిపారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలని ఉద్దేశంతోనే జిల్లా కేంద్రంలో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరైనట్లు వెల్లడించారు. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల్ని తీసుకువెళ్లడానికి ముందుకు రాని వారి జన్మ ఎందుకన్నారు. అలాంటివారిని ఎలా చూడాలన్నారు. అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రారని తెలిసి ఉంటే అలాంటివారికి జన్మనివ్వడమే వృథా అని తల్లిదండ్రులు భావించే వారని ఆవేదన చెందారు. అపోహలు వీడి ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మంత్రి స్ఫూర్తివంతమైన నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. కరోనారే భయపడి అంత్యక్రియలకు దూరంగా వుంటే మంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం అంటున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
9 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
12 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
10 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
14 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
7 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా