newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

హోం శాఖ సహాయ మంత్రికి ఇంటి కష్టాలు..!

20-09-201920-09-2019 15:46:47 IST
Updated On 20-09-2019 17:23:33 ISTUpdated On 20-09-20192019-09-20T10:16:47.115Z20-09-2019 2019-09-20T10:16:44.410Z - 2019-09-20T11:53:33.934Z - 20-09-2019

హోం శాఖ సహాయ మంత్రికి ఇంటి కష్టాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హోం శాఖ సహాయ మంత్రి అయిన కిషన్‌రెడ్డికి ఇంటికి కష్టాలొచ్చాయి.. అదేంటి కేంద్ర హోం సహాయ మంత్రి హోదాలో ఉన్న అతనికి ఇంటి కష్టాలేంటని ఆశ్చర్యపోతున్నారా.. వివరాల్లోకి వెళితే.. అమిత్‌ షాకి జూనియర్‌ మంత్రి అయిన కిషన్‌ రెడ్డి అధికార నివాసం లేకపోవడంతో ఆంధ్రా భవన్‌ నుంచే నాలుగు నెలలుగా తన పనులు చక్కబెడుతున్నారు.

కిషన్‌ రెడ్డికి కేంద్రం రెండు బంగ్లాలు కేటాయించింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలవుతున్నా మాజీ ఎంపీలు వాటిని ఖాళీ చేయకపోవడంతో.. ఆయనకు ఆంధ్రా భవన్ దిక్కయ్యింది. 16వ లోక్‌ సభ మే 25న రద్దయ్యింది. దీంతో నిబంధనల ప్రకారం మాజీ ఎంపీలు జూన్‌ 25 నాటికి తమ బంగ్లాలను ఖాళీ చేయాలి. కానీ వారు ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.

హోం శాఖ సహాయ మంత్రి అయిన కిషన్‌ రెడ్డికి తుగ్లక్‌ రోడ్డులోని ఓ బంగ్లాను కేటాయించారు. అందులో కేంద్ర మాజీ మంత్రి జయంత్‌ సిన్హా ఉంటున్నారు. దీంతో మరో బంగ్లా కేటాయించాలని పట్టణాభివృద్ధి శాఖను మంత్రి కోరారు. కిషన్‌ రెడ్డి అభ్యర్థన మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా అశోక్‌ రోడ్డులోని బంగ్లాను కేటాయించారు.

ఆ ఇంట్లో రాధా మోహన్‌ సింగ్‌ ఉంటున్నారు. బంగ్లా ఖాళీ చేయడానికి కాస్త టైం కావాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేం లేక కిషన్‌ రెడ్డి ఆంధ్రా భవన్‌లో ఉంటున్నారు. మీరుంటున్న బంగ్లాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లండని ప్రభుత్వం గత నెలలో మాజీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఖాళీ చేయాలని సూచించింది. మూడు రోజులు గడిచాక.. మాజీలు ఉంటున్న బంగ్లాలకు నీరు, కరెంట్‌ సరఫరా ఆపేయాలని అధికారులను ఆదేశించింది. మోదీ కూడా ఈ సమస్యపై ట్విట్లు చేశారు. ఎంపీలను కలవడానికి చాలా మంది వస్తారు. కాబట్టి దయ చేసి సమస్యను అర్థం చేసుకొని ఖాళీ చేయాలని ఆయన కోరారు. కానీ ఫలితం లేకపోయింది. మరి మన కిషన్‌రెడ్డికి ఇంటి కష్టాలు ఎప్పుడు తీరుతాయో వేచిచూడాల్సిందే.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   8 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle