newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హోం ఐసోలేషన్లోకి మాజీ ఎంపీ కవిత ఫ్యామిలీ

24-07-202024-07-2020 12:51:10 IST
Updated On 24-07-2020 13:03:27 ISTUpdated On 24-07-20202020-07-24T07:21:10.593Z24-07-2020 2020-07-24T07:20:58.519Z - 2020-07-24T07:33:27.141Z - 24-07-2020

హోం ఐసోలేషన్లోకి మాజీ ఎంపీ కవిత ఫ్యామిలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత కుటుంబం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. తాజాగా క‌విత ఇంట్లో ప‌ని చేసే ఓ డ్రైవ‌ర్‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ రావ‌డంతో వీరంద‌రినీ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంచారు అధికారులు. దీంతో వారం నుంచి ప‌ది రోజుల పాటు క‌విత కుటుంబం మొత్తం ఇంటికే ప‌రిమితం కానుంది.

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పరిధిలో 662 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అంతటా కలిపి 33, సంగారెడ్డి జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 75, కరీంనగర్ 38, మహబూబ్ నగర్లో 61, సిరిసిల్ల జిల్లాలో  62 , నిజామాబాద్ జిల్లాలో 38, సూర్యాపేట జిల్లాలో 39 కేసులు నమోదయ్యాయి, 

ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ బారిన ప‌డ్డారు. ఇక మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటిపోయింది. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. గురువారం కొత్తగా 1,567 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా బారినపడి తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కూ 447 మంది ప్రాణాలు కోల్పోయారు.

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనతోపాటు డ్రైవర్, పీఏ, గన్‌మెన్‌కు పరీక్షలు చేయగా.. వారికి కూడా  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే శ్రీహరి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన సిబ్బందిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి సోకడంతో హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత జి. నరేంద్ర యాదవ్‌ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కరోనా తాజా పరిస్థితులతో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   4 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   5 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   10 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   8 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   10 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   11 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   6 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle