newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో 7,138 మందికి క‌రోనా టెస్టులు

12-02-202012-02-2020 11:02:31 IST
2020-02-12T05:32:31.343Z12-02-2020 2020-02-12T05:32:28.799Z - - 16-04-2021

హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో 7,138 మందికి క‌రోనా టెస్టులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా అనుమానితుల సంఖ్య ప్ర‌పంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతోంది. మొట్ట మొద‌ట‌గా క‌రోనా బాధితుల‌ను వైర‌స్‌  సోకిందా..?  లేదా..? అనే అంశాల‌ను గుర్తించ‌డంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ అరైవ‌ల్స్  అన్నీ కూడా ఎయిర్‌పోర్టుల నుండే వ‌చ్చే ఆస్కారం ఉన్న నేప‌థ్యంలో థ‌ర్మ‌ల్‌ స్ర్కీనింగ్ ప్ర‌తీ ఒక్క వ్య‌క్తికి కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 7,138 మందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన్ట‌టు హైద‌రాబాద్‌ ఎయిర్‌పోర్టు చీఫ్ హెల్త్ ఆర్గ‌నైజ‌ర్ డా.అనూరాధ తెలిపారు.

కరోనా వైర‌స్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులంతా అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని, మ‌రీ ముఖ్యంగా హాంకాంగ్‌, థాయిలాండ్, సింగ‌పూర్ నుండి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల న‌డుమ థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ టెస్టులు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. క‌రోనా వైర‌స్ 28 దేశాల‌కు విస్త‌రించ‌డంతో విదేశాల నుండి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ప్ర‌త్యేక దీష్టి సారించామ‌న్నారామె.

జ‌న‌వ‌రి 18 నుండి ఎయిర్‌పోర్టుల‌లో స్ర్కీనింగ్ టెస్టులు ప్రారంభించామ‌ని, క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ కోసం ఉప‌యోగిస్తున్నవ‌న్నీ కూడా అత్యాధునిక ప‌రిక‌రాల‌ని చెప్పారు.

ఇంకా ఆమె మీడియాతో మాట్లాడుతూ, హైద‌రాబాద్ కంటే ముందుగా ముంబై, కోల్‌క‌తా, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల‌లో క‌రోనా వైర‌స్ టెస్టులు నిర్వ‌హించ‌డం ప్రారంభించారు. ఆ త‌రువాత హైద‌రాబాద్‌, చెన్నై, కొచ్చి ఎయిర్‌పోర్టుల్లో క‌రోనా వైద్య ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. చైనా నుండి హైద‌రాబాద్‌కు ఇప్ప‌టికీ డైరెక్ట్ ఫ్లైట్స్ అంటూ లేవు. థాయిలాండ్‌, సింగ‌పూర్‌, హాంకాంగ్ ప్రాంతాల నుండి వ‌చ్చే వారంద‌రికీ యూనివ‌ర్స్ స్ర్కీనింగ్ జ‌రుగుతుంది.  

ప్ర‌యాణికులు విమానం దిగి ఎయిర్‌పోర్టులోకి ఎంట‌ర్ అవుతున్న‌ప్పుడు 15 అడుగుల దూరం నుండే ఒక‌రి త‌రువాత మ‌రొక‌రిని ర‌మ్మంటావు. అంత దూరం నుండి వ‌స్తున్న‌ప్పుడే వాళ్ల‌కు జ్వ‌రం ఉన్నా వెంట‌నే థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్‌లో క‌నిపిస్తుంది. ఇలా అన్ని విమాన ప్ర‌యాణికుల‌కు స్కీనింగ్ టెస్టులు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. క‌రోనా అనే కాకుండా మ‌రేదైనా వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించినా ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్ష‌న్ ఎక్విప్‌మెంట్ కింద తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

క‌రోనా విష‌యంలో వ‌చ్చిన త‌రువాత తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌కంటే రాకుండా నియంత్రించ‌డమే ఉత్త‌మం. అందుకు ప్ర‌తీ ఒక్క‌రు అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అలాంటి అవ‌గాహ‌న ప్ర‌తి ఒక్కరికీ క‌ల్పించే పాత్ర అంద‌రూ కూడా తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు అభినంద‌నీయ‌మ‌ని హైద‌రాబాద్‌ ఎయిర్‌పోర్టు చీఫ్ హెల్త్ ఆర్గ‌నైజ‌ర్ డా.అనూరాధ తెలిపారు.

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   22 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle