హైదరాబాద్‌లో కరోనా కల్లోలం.. ఇక నిర్బంధం ఒక్కటే మార్గం..?
29-06-202029-06-2020 07:32:47 IST
Updated On 29-06-2020 11:29:07 ISTUpdated On 29-06-20202020-06-29T02:02:47.371Z29-06-2020 2020-06-29T02:02:29.987Z - 2020-06-29T05:59:07.512Z - 29-06-2020

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి భయానక స్థాయిలో పెరుగుతుంది. నెల రోజుల క్రితం కేవలం పదుల సంఖ్యలో నమోదైన కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఊహించని స్థాయిలో పెరుగుతోంది. హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేయడం, కేంద్రం కూడా చెప్పడంతో టెస్టుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. టెస్టులు తక్కువగా చేసినన్ని రోజులు తక్కువ పాజిటీవ్ కేసులు నమోదు కాగా, ఇప్పుడు టెస్టుల సంఖ్య పెరగడంతో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. అయినా, కూడా ఇంకా టెస్టుల సంఖ్య రోజుకు నాలుగు వేలకు మించి చేయడం లేదు. నిజానికి ఇతర రాష్ట్రాలతో చూస్తే తెలంగాణ చేస్తున్న టెస్టుల సంఖ్య చాలా చాలా తక్కువ. ఇప్పటికీ తక్కువ టెస్టులే చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం విపరీతంగా ఉంటోంది. పాజిటివిటీ రేటులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లుగా ఉంది. కోటి మందికి పైగా జనాభా ఉన్న విశ్వనగరం హైదరాబాద్‌లో ఇప్పుడు కరోనా పాజిటీవ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో పాజిటీవ్ కేసుల సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. కానీ, టెస్టుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఆయా రాష్ట్రాల్లో చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున టెస్టులు చేస్తే హైదరాబాద్‌లో ఎన్ని కేసులు బయటపడతాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే వరకు సుమారు 14 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 90 శాతం కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువ సంభవిస్తున్నాయి. ప్రమాదకర రీతిలో హైదరాబాద్‌లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అంటూ వారం రోజుల్లో హైదరాబాద్‌లో 50 వేల టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, చెప్పిన దాంట్లో సగం టెస్టులు చేయకముందే చేతులెత్తేసింది. తీసుకున్న శాంపిళ్లు టెస్టు చేసే సామర్థ్యం లేక ఇప్పుడు టెస్టులు నిలిపివేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే, కనీసం ఎన్ని టెస్టులు చేయగలము అనే లెక్కలు కట్టడంలోనే వైఫల్యం ఉంది. మరోవైపు కరోనా ట్రీట్మెంట్కు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో భారం పెరిగిపోతోంది అంటూ జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కిన పరిస్థితులు కూడా చూశాం. ఆర్భాటంగా చెప్పిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) కోవిడ్ ఆసుపత్రి ప్రారంభం కూడా జరగడం లేదు. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వసతులు కూడా కల్పించడం లేదని కరోనా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆదివారం మరీ దారుణమైన ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ 35 ఏళ్ల కరోనా బాధితుడు తనకు ఊపిరి ఆడటం లేదని, వెంటిలేటర్ తీసేశారని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఆ తర్వాత అతడు మరణించాడు. ఇంతకుముందు కూడా యువ జర్నలిస్టు ఈ రకంగానే వైద్యం అందడం లేదని ఆరోపించిన తర్వాత మరణించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ కారణాలు ఎన్ని చెప్పినా, తమ తప్పేమీ లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినా కరోనా బాధితులకు సరైన వైద్య సహాయం అందించడంలో లోపాలు మాత్రం ఇటువంటి వీడియోల ద్వారా బాధితులు చెబుతూనే ఉన్నారు. మరోవైపు లాక్డౌన్ తర్వాత అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందనే అంచనాలు ఉన్నాయి. నగరంలో కరోనా వైరస్ సోకని ప్రాంతమే లేదు. నిజానికి కమ్యూనిటీ వ్యాప్తి లేదనేది ఆశాజనకంగా కనిపిస్తున్నా త్వరలోనే ఈ పరిస్థితి కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రభుత్వం సూచించిన నిబంధనలు ప్రజలు, వ్యాపారులు సరిగ్గా అమలు చేయడం లేదు. దీంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంగా హైదరాబాద్ క్రమంగా సెల్ప్ లాక్డౌన్లోకి వెళ్లిపోతోంది. వైరస్ వ్యాప్తి చూసి వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనరల్ బజార్, బేగంబజార్ వంటివి స్వచ్ఛందంగా మూతబడ్డాయి. రాణీగంజ్ మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ షాపుల నిర్వహాకులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతుండటంతో వారు కూడా 15వ తేదీ వరకు మెడికల్ షాపులు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగరంలో కరోనా వ్యాప్తి నివారణకు మరోసారి లాక్డౌన్ ఒక్కటే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. రెండుమూడు రోజుల్లో ఈ మేరకు నిబంధనలు రూపొందించి హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 15 రోజుల పాటు మరోసారి సంపూర్ణ లాక్డౌన్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ లాక్డౌన్ తప్పేలా లేదు.

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!
11 hours ago

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు
15 hours ago

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
12 hours ago

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ
16 hours ago

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!
14 hours ago

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత
19 hours ago

లక్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడినట్లే- రఘురామ
18 hours ago

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
21 hours ago

షర్మిల పక్కనే విజయమ్మ.. లాభమా నష్టమా
17 hours ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
a day ago
ఇంకా